రవితేజ `ఈగల్‌` సినిమాని ఎవరూ కొనడం లేదా?.. మాస్‌ మహారాజాకి ఇలాంటి పరిస్థితేంటి?

Published : Jan 25, 2024, 06:23 PM ISTUpdated : Jan 26, 2024, 12:27 AM IST

రవితేజ నటించిన `ఈగల్‌` సినిమాని ఎవరూ కొనడం లేదా? బయ్యర్లు ముందుకు రావడం లేదా? ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపించడం లేదా? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
15
రవితేజ `ఈగల్‌` సినిమాని ఎవరూ కొనడం లేదా?.. మాస్‌ మహారాజాకి ఇలాంటి పరిస్థితేంటి?

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం `ఈగల్‌` చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ పోటీ నేపథ్యంలో నిర్మాతల మధ్య కుదిరిన రాజీ కారణంగా `ఈగల్‌` మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. అయినా ఈ చిత్రానికి ఇప్పుడు మూడు సినిమాలు పోటీకి వచ్చాయి. సందీప్‌ కిషన్‌ `ఊరు పేరు భైరవకోన`, `యాత్ర 2`, `లాల్‌ సలామ్` చిత్రాలున్నాయి. తాజాగా దీనిపై నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. `భైరవకోన` మూవీని వాయిదా వేయించేందుకు కౌన్సిల్‌ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిర్మాత అనిల్‌ సుంకర ఒప్పుకుంటాడా అనేది పెద్ద సమస్య. 
 

25

ఇదిలా ఉంటే `యాత్ర 2` కచ్చితంగా రిలీజ్‌ అవుతుంది. రజనీకాంత్‌ నటించిన `లాల్‌ సలామ్‌` ఎలాగూ ఆగదు. తమిళ రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో అది కూడా రిలీజ్‌ అవుతుంది. దీంతో మళ్లీ మూడు సినిమాలు పోటీలో ఉంటాయి. ఇది కొంత ఎఫెక్టే అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో సమస్య `ఈగల్‌` చిత్రాన్ని వెంటాడుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకి ఇంకా బిజినెస్‌ కాలేదట. సినిమాని కొనేందుకు ఓవరూ ముందుకు రావడం లేదట. 
 

35

నిర్మాతలు చెప్పిన రేట్‌కి బయ్యర్లు సుముఖత చూపడం లేదని, బార్గెయిన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. కానీ రవితేజ నటించిన గత చిత్రాలు `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు` ఘోరంగా పరాజయం చెందాయి. నిర్మాతకి, కొన్న బయ్యర్లకి దారుణంగా నష్టాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు `ఈగల్‌` మూవీకి పెద్దగా బజ్‌ లేదు. టీజర్‌, ట్రైలర్లు వచ్చినా, ఏమాత్రం హైప్‌ తీసుకురాలేకపోయాయి. టెక్నీకల్‌గా హైలో ఉన్నా, కమర్షియల్‌ అంశాలు లేకపోవడంతో ఈ మూవీకి హైప్‌ రావడం లేదని తెలుస్తుంది. 
 

45

రవితేజ సినిమా అంటే యాక్షన్‌తోపాటు పాటలు, ఫైట్లు, ఫన్‌, ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఇలా అన్నీ మిక్స్ అయి ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుంది. పైగా రవితేజ సినిమాలంటే సీరియస్‌గా చూడలేం. కచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాల్సిందే. అది మిస్‌ అయితే ఆ కిక్‌ ఉండదు. `ఈగల్‌` పరిస్థితి కూడా అదే. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌గా, యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ఈ కారణంగా బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. 
 

55

ఈ మూవీకి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఇప్పటి వరకు కాలేదట. ఇదే కాదు, ఓటీటీ కూడా సెట్‌ కాలేదని, ఓటీటీ సంస్థలు కూడా ముందుకు రావడం లేదని సమాచారం. ఓటీటీలో రవితేజ సినిమాలు పెద్దగా ఆడటం లేదని, వ్యూస్ రావడం లేదనే కంప్లెయింట్‌ ఉంది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ మూవీని కొనేందుకు సుముఖత చూపడం లేదని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ రవితేజ వంటి స్టార్‌ హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక చిన్న హీరోల సినిమాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక రవితేజ సరసన కావ్య థాపర్‌ నటించిన `ఈగల్‌` చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories