ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక మందాన్న, రామ్‌చరణ్ - శంకర్ కాంబోలో మూవీలో లీడ్ రోల్‌లో నటించబోతుందని టాక్ వినబడుతోంది...
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కించబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ముందుగా ఈ సినిమాలో కియారా అద్వాణీని హీరోయిన్‌గా అనుకున్నారు..
అయితే ఇప్పటికే రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన కియారా, ఇప్పుడు ‘ఆచార్య’ మూవీలోనూ ఆడిపాడుతోంది. దీంతో వరుసగా ఆమెతోనే సినిమాలు చేస్తే, ఫ్యాన్స్ కొత్తదనం మిస్ అవుతారని భావించాడట చెర్రీ...
అదీకాకుండా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉన్న కియారా అద్వానీ, రామ్‌చరణ్- శంకర్ సినిమాకి భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు కాల్షీట్ల విషయంలో కూడా కండీషన్లు పెట్టిందట.
దీంతో బావ అల్లుఅర్జున్ ‘పుష్ఫ’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ‘నేషనల్ క్రష్’ రష్మిక మందాన్ననే, శంకర్- రామ్ చరణ్ మూవీలో హీరోయిన్‌గా ఎన్నికైనట్టు తెలుస్తోంది...
పెద్దగా అందం లేకపోయినా అదృష్టం మెండుగా ఉన్న రష్మిక... ఇప్పటికే ఈ ఏడాది మూడు భాషల్లో మూడు సినిమాలను విడుదల చేసింది. అల్లుఅర్జున్- సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ఫ’లో కూడా రష్మిక పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది...
‘మిషన్ మజ్నూ’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక, ‘గుడ్‌బై’ అనే మరో సినిమాలో ‘బిగ్‌బీ’ అమితాబ్ పక్కన నటిస్తోంది.
ఈ సినిమాలు కాకుండా శర్వానంద్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేస్తోంది.
సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ‘#RC15’ సినిమా పనులను ఇప్పటికే మొదలెట్టేసిన డైరెక్టర్ శంకర్, ఆ సినిమా కోసం ఇంకా పూర్తికాని కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాను పక్కనబెట్టేశాడు.
ఇప్పటికే ‘పుష్ఫ’ రూపంలో ఓ పాన్ ఇండియా మూవీ, రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక, రామ్‌చరణ్, శంకర్ కాంబోలో హీరోయిన్‌గా ఫిక్స్ అయితే మాత్రం... ఆమె దూకుడును ఆపడం కష్టమే...