పర్పుల్ కలర్ ట్రెండీ వేర్‌లో మెస్మరైజ్ చేస్తుంది రష్మిక మందన్నా. థైస్ కనిపించేలా ఉన్న డ్రెస్‌లో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. దీంతో రష్మిక మందన్నా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లకి చూపు తిప్పుకోనివ్వడం లేదు. రష్మిక `పుష్ప` సక్సెస్ పార్టీలో ఇలా మరింత హాట్‌గా రెడీ అయి యూనిట్ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
రష్మిక మందన్నా..`పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. శ్రీవల్లి పాత్రలో ఆమె మెస్మరైజ్ చేసింది. డీ గ్లామర్ లుక్‌లో అదరగొట్టింది రష్మిక. `సామి సామి` పాటలో కుర్రాళ్ల మతిపోగొట్టింది. మరింత హాట్‌గా కనిపిస్తూ చూపు తిప్పుకోలేదంటే అతిశయోక్తి కాదు.
`పుష్ప` చిత్రం సక్సెస్ అయిన సందర్బంగా సోమవారం రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఇందులో దర్శకులు, నిర్మాతలు, `పుష్ప` చిత్ర యూనిట్ పాల్గొని సందడిచేసింది. పార్టీని ఎంజాయ్ చేశారు. ఇందులో రష్మిక మందన్నా హైలైట్ గా నిలిచింది. తనదైన ట్రెండీ వేర్‌లో కనిపించి మంత్రముగ్దుల్ని చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
రష్మిక.. `పుష్ప` చిత్రంలో బన్నీ కోసం, దర్శకులుసుకుమార్ కోసం నటించినట్టు తెలిపిన విషయం తెలిసిందే. సినిమా కథ కూడా తెలుసుకోకుండా, వారిపై నమ్మకంతో చేశానని తెలిపింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్‌గా రాణిస్తుంది. ఆమెని బన్నీ ఏకంగా క్రష్మిక అంటూ పిలవడం విశేషం. ఆయన అలా పిలవడాన్ని చాలా కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని చెప్పింది రష్మిక మందన్నా. చలాకీతనం, సరదాగా ఉండే తత్వంతో అందరిని ఆకట్టుకుంటున్న రష్మిక ఇప్పుడు నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
శాండల్ వుడ్ నుంచి, బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది రష్మిక మందన్నా. బాలీవుడ్‌లో ఇప్పుడు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో `మిషన్ మజ్ను`, `గుడ్‌బై` చిత్రాలున్నాయి. దీంతోపాటు మరో సినిమా చేస్తుంది.
ఇక తెలుగులో `పుష్ప` రెండో భాగంలో నటించబోతుంది. దీంతోపాటు `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు మరో తెలుగు సినిమాకి కమిట్ అయినట్టు తెలిపింది.
ఇదిలా ఉంటే రష్మిక.. సమంతపై ప్రశంసలు కురిపించింది. లేటెస్ట్ గా ఓ ఫోటోని పంచుకుంటూ స్ట్రాంగెస్ట్ గర్ల్స్ ఎవరూ అంటూ తన అభిమానులను ప్రశ్నించింది. తన ఆలోచన మేరకు ఐదుగురు బలమైన అమ్మాయిలు వీరే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది రష్మిక మందన్నా.
ఇందులో మొదటగా తన పేరుని మెన్షన్ చేసింది. ఆ తర్వాత తన మదర్ సుమన్ మందన్నా, స్టయిలిస్ట్, నిర్మాత శ్రావ్య వర్మ, ఐశ్వర్యా కొల్లాతోపాటు సమంత పేరుని కూడా పేర్కొంది.
తన దృష్టిలో సమంత స్ట్రాంగెస్ట్ గర్ల్ అని పేర్కొంది. హీరోయిన్లలో సమంత పేరునే మెన్షన్ చేయడం విశేషం. అన్నట్టు `పుష్ప` చిత్రంలో సమంత ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.