రష్మిక మందన్నాకి ప్రమాదం, ఇప్పుడెలా ఉందంటే? ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్

First Published | Sep 9, 2024, 9:08 PM IST

రష్మిక మందన్నాకి ప్రమాదం జరిగిందట. తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్ తో షాకిచ్చింది నేషనల్‌ క్రష్‌. ఎమోషనల్‌ నోట్‌ వైరల్‌ అవుతుంది. 
 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తనకు సంబంధించిన ప్రతిదీ పంచుకుంటుంది. ఏదీ లేకపోతే తన క్యూట్‌, చిలిపి ఫోటోలను సైతం పంచుకుంటుంది. హాయ్‌ చెబుతూ, ఫ్యాన్స్ ని అలరిస్తుంది. వారికి నిత్యం టచ్‌లోనే ఉంటుంది.

కానీ అనూహ్యంగా ఆమె నెల రోజులకుపైగా సోషల్‌ మీడియాకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించింది రష్మిక. తాను సోషల్‌ మీడియాకి దూరం కావడానికి కారణమేంటో చెప్పింది. ఈ సందర్భంగా పెద్ద షాకిచ్చింది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

రష్మిక మందన్నా గాయాలపాలయ్యిందట. తనకు గాయాలు అయ్యాయని, అందువల్లే సోషల్‌ మీడియాకి దూరంగా ఉన్నట్టు చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్‌(ఎక్స్) ద్వారా పోస్ట్ పెట్టింది రష్మిక మందన్నా. నేను సోషల్‌ మీడియాకి కనిపించి చాలా రోజులవుతుందని నాకు తెలుసు.

గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం నాకు చిన్న ప్రమాదం జరిగింది(మైనర్‌). ఇప్పుడు నేను దాన్నుంచి కోలుకుంటున్నాను. డాక్టర్లు చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉన్నాను.

ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను. ఇప్పుడు చాలా చురుకుగా ఉండే దశలో ఉన్నాను. కాబట్టి నా యాక్టివిటీస్‌ అన్ని బాగానే చూసుకుంటున్నాను.
 


మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి.  ఎందుకంటే జీవితం చాలా చిన్నది. మనకు రేపు ఉందో లేదో తెలియదు. కాబట్టి ప్రతి రోజూ ఆనందంగా ఉండండి` అని పేర్కొంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఆమె పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఏం జరిగిందంటూ ఆరా తీస్తున్నారు. ఏం జరిగిందో రష్మిక చెప్పలేదు. ఈ సందర్భంగా ఆమె ఒక చిలిపి ఫోటోని పంచుకుంది. 
 

రష్మిక మందన్నా ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అందులో భాగంగా ఆమె `పుష్ప 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలోనే ఉంది. ఇది డిసెంబర్‌లో రాబోతుంది. దీంతోపాటు రష్మిక.. `ది గర్ల్ ఫ్రెండ్‌` అనే మూవీలో నటిస్తుంది.

లేడీ ఓరియెంటెడ్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే `రెయిన్‌బో` అనే బైలింగ్వల్‌ ఫీమేల్ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. ఇది ఆగిపోయినట్టు సమాచారం. అలాగే `కుబేర` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `సికందర్` చిత్రంలో నటిస్తుంది. ఇలా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది నేషనల్‌ క్రష్‌. 
 

రష్మిక మందన్నా సినిమాల విషయంలో చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఆమె అన్ని కమర్షియల్‌ సినిమాలు చేయడం లేదు. కంటెంట్‌ ఉన్న మూవీస్‌, అదే సమయంలో తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. అందుకే ఆమె సక్సెస్‌ అవుతుంది. స్టార్‌ హీరోయిన్‌గా నిలబడుతుంది.

చాలా మంది హీరోయిన్లు వచ్చీ పోతున్నా తన పొజీషియన్‌ని, తన క్రేజ్‌ని, ఇమేజ్‌ని తగ్గకుండా చూసుకుంటుంది రష్మిక. ఇలానే కొనసాగితే, తిరుగులేని నేషనల్‌ క్రష్‌ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్లు, ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం ఇక్కడ చూడండి.
 

Latest Videos

click me!