విజయ్ దేవరకొండతో డేటింగ్ అంటూ రూమర్లు.? స్పందించిన రష్మిక మందన్న.!

First Published | Jan 19, 2023, 6:02 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవకొండ - స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) డేటింగ్ లో ఉన్నట్టు కొద్దిరోజులుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి. పుకార్లపై తాజాగా నేషనల్ క్రష్ తనదైన శైలిలో స్పందించారు. 
 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘గీతాగోవిందం’తో టాలీవుడ్ లో మంచి హిట్ ను అందుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా వెండితెరపై బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో వెంటనే ‘డియర్ కామ్రేడ్’తో అలరించారు. ఈ సినిమా పెద్ద ఆకట్టుకోలేకపోయింది.
 

కానీ, విజయ్ - రష్మిక పెయిర్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అన్ని రకాల సీన్లలో ఇద్దరి పెర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో మళ్లీ వీరిద్దరూ జంటగా ఎప్పుడూ అలరించబోతున్నారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 


ఇదిలా ఉంటే.. రష్మిక - విజయ్ డేటింగ్ లో ఉన్నారంటూ ‘గీతా గోవిందం’ చిత్రం నుంచి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. వీటిపై ఎప్పుడూ అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ పెద్దగా స్పందించలేదు. రీసెంట్  గా ఇద్దరు కలిసి వేకేషన్స్ కు వెళ్లారని, న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారని వార్తలు వచ్చాయి. 
 

ఈనెల ప్రారంభంలో న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక మందన్న తన ఫ్యాన్స్ తో నిర్వహించిన లైవ్ సెషన్ లో విజయ్ వాయిస్ వినిపిస్తుందంటూ.. ఇద్దరూ న్యూ ఇయర్ వేడుకులను మాల్దీవుల్లో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున్న పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న స్పందించారు. 
 

ఆమె మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా మనకు కావాల్సిందే వింటున్నట్టు భావిస్తాం. అలాగే ఆ వీడియోలో విజయ్ వాయిస్ విన్నట్టుగా అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఆ సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారంతే. ఇక విజయ్ విషయానికొస్తే నాకు బెస్ట్ ఫ్రెండ్. ప్రస్తుతం విజయ్ తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇటు నేను అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ఎదురుచూస్తున్నాను.
 

విజయ్ తో డేటింగ్ రూమర్లు పుట్టడానికి కారణం.. ‘గీతాగోవిందం’లోని క్యారెక్టరైజేషన్స్. వెండితెరపై మా పెయిర్ అందరికీ నచ్చడంతో ప్రేక్షకులు గుండెల్లో నిలిచింది. అందుకే అలాంటి రూమర్లకు కారణమని అభిప్రాయపడుతున్నాను. ఇక టూర్లకు, వేకేషన్లకు వెళ్లడం అనే వార్తలు వచ్చాయి. నేను ఎప్పుడూ వేకేషన్ కు వెళ్లిన ఎడెనిమిది స్నేహితులతో కలిసే వెళ్తాం. 
 

ఇక అటు విజయ్, నేను సెలబ్రెటీలం కావడంతో ఇలాంటి రూమర్లు రావడం సాధారణం. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అనవసరమైన రూమర్లు వచ్చినప్పుడు కాస్తా బాధాగా ఉంటుంది. అలాగే అటు విజయ్ ఇంట్లో గానీ, ఇటు మా ఫ్యామిలీలో గానీ కాస్తా ఇబ్బందిగానే ఉంటుంది. వాటిపై కంటే సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందం’టూ యాంకర్ ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. 
 

భారీ చిత్రాల్లో నటిస్తూ రష్మిక బిజీగా ఉంది. గతేడాది ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘గుడ్ బై’,‘సీతారామం’తో అలరించింది. సంక్రాంతికి విజయ్ ‘వారసుడు’తోనూ హిట్ అందుకున్నారు. ఈ నెలలో‘మిషన్ మజ్ను’ హిందీ ఫిల్మ్ రిలీజ్ సిద్ధంగా ఉంది.  ప్రస్తుతం రన్బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ నటిస్తోంది. Pushpa The Ruleలోనూ నటిస్తూ బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంది. ఇక విజయ్ దేవరకొండ ‘ఖుషీ’లో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరితో ‘VD12’ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!