Rashi Khanna: రాశీ ఖన్నాకు లైఫ్ ఇచ్చిన రాజమౌళి.. బాహుబలిలో మాత్రం తీసుకోలేదట, ఎందుకంటే..?

Published : Apr 17, 2022, 05:12 PM IST

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయినలలో రాశీ ఖన్నా కూడా ఒకరు. తను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం రాజమౌళినే అంటుంది బ్యూటీ. అంతే కాదు తన గురించితాను కొన్ని విషయాలు పంచుకుంది.   

PREV
17
Rashi Khanna: రాశీ ఖన్నాకు లైఫ్ ఇచ్చిన రాజమౌళి.. బాహుబలిలో మాత్రం తీసుకోలేదట, ఎందుకంటే..?

కలెక్టర్ కాబోయి యాక్ట్రస్ అయ్యిందట రాశీ ఖన్నా. చిన్నతనం నుంచి తాను కలెక్టర్ నే అని ఊహించుకునేదట. ఇక నేను కలెక్టర్ నే అని ఫిక్స్ అయిన రాశీ ఖన్నా.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. అయితే తనకు తాను రియలైజ్ అయ్యి.. కలెక్టర్ అయితే ఒక జిల్లాకే పరిమింత అవ్వాలి.. హీరోయిన్ అయితే దేశమంతా క్రేజ్ ఉంటుంది అని  సర్ధి చెప్పుకుందంట. 
 

27

నిజానికి బాహుబలి సినిమాలో హీరోయిన్ గా తానే చేయాల్సి ఉందంటోంది రాశీ ఖన్నా. బహుబలి ఆడియన్ కు కూడా వెళ్ళిందట. రాజమౌళికి కూడా నచ్చిందట. అయితే ఈ అమ్మాయి చేతిలో కత్తి చూడలేకపోతున్నాను అన్నారట. అయితే బాహుబలిలో తీసుకోకపోయినా.. ఊహలు గుసగుసలాడే సినిమాకు తనను రికమండ్ చేశారట జక్కన్న. 

37

బోల్డ్ సీన్స్ చేస్తే తప్పేంటి అని అడుగుతుంది రాశీ ఖన్నా. ముద్దులు, శృంగారం, నవ్వులు, ఏడుపులు అన్నీ నటనలో భాగమే అంటోంది. మరీ బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే మాత్రం ఇంట్లో వాళ్లను ప్రిపేర్ చేస్తుందట. తనను అర్ధం చేసుకుని ఇంట్లో వాళుకూడా మద్దతు ఇవ్వబట్టే సినిమాలు చేయగలుగుతున్నా అంటోంది రాశీ ఖన్నా. 

47

లైఫ్ లో చాలా సార్లు ప్రేమలో పడిందట  రాశీ. అంతే కాదు  చాలా లవ్ ఫేయిల్యూర్స్ కూడా ఫెస్ చేసిందంట బ్యూటీ. అయినా సరే ఇంకోసారి కూడా లవ్ లో పడటానికి రెడీ అంటోంది రాశీ ఖన్నా. తన తల్లీ తండ్రుల ప్రేమ పెళ్లి తనకు ఆదర్శం అంటోంది. 

57

రాశీ ఖన్నా  మంచి నటి మాత్రమే కాదు. కవి, సింగర్ కూడాను. చిన్నతనంలోనే సంగీతం నేర్చుకుందట రాశీ. ఇండియన్ ఐడల్ కు కూడా వెళ్ళిందట, కాని వయస్సు సరిపోక ఆమె వెనుదిరగాల్సి వచ్చిందంటోంది. తనలోని మల్టీ టాలెంట్ కు ముందు ముందు పదును పెడతానంటోంది. 

67

తన ఫిల్మ్ కెరీర్ లో ఫెయిన్ అయినా సరే తాను చాలా ఇష్టంగా చేసిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ అని అంటుంది రాశీ.  ఈ సినిమా కోసం ఆమె చాలా కష్ట పడ్డానంటోంది. ఈ సినిమాలో తన పాత్ర అంటే చాలా ఇష్టమంట రాశీకి. 

77

ప్రస్తుతం రాశీ ఖన్నా సౌత్ నుంచి బాలీవుడ్ బాట పట్టింది. ఇక్కడ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో పాగా వేయాలి అని చూస్తోంది. ఇటు తమిళంలో కూడా రాశీకి హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉంది.

click me!

Recommended Stories