బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ కు దెబ్బ మీద దెబ్బ.. వరుస ఫ్లాప్స్ తో డేంజర్ బెల్స్.. వైరల్ గా లేటెస్ట్ పిక్స్!

First Published | Nov 30, 2022, 9:16 PM IST

ఈ ఏడాది బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరించిన స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh)కు వరుస ఫ్లాప్స్ ఎదురయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్ కేరీర్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.  ప్రస్తుతం రకుల్  పరిస్థితి ఏంటీ?  విశ్లేషకులకు అభిప్రాయాలు ఆసక్తికరంగా మారాయి.

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోయిన్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ ను ఊపూపిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.
 

2019లో వచ్చిన ‘కొండపొలం’ తర్వాత తెలుగులో మరే చిత్రానికి  సైన్ చేయలేదీ బ్యూటీ. నేరుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అప్పటికే నాలుగైదు హిందీ చిత్రాల్లో నటించి రకుల్.. గతేడాది నుంచి పూర్తిగా బాలీవుడ్ లోనే పాగా వేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ దుమ్ములేపుతోంది.


ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలవడం విశేషం. ‘ఏటాక్’,‘రన్ వే 34’, ‘చట్ పుట్లీ’,‘థ్యాంక్ గాడ్’, ‘డాక్టర్ జీ’ వంటి చిత్రాలతో 2022లో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేసింది. వరుస చిత్రాలతో రకుల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
 

అయినా, రకుల్ ప్రీత్ కేరీర్ కు ముప్పు తప్పదంటూ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు అభిప్రాయపడ్డారు. ఇందుకు కారణం.. ఈ ఏడాది వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకోవడమే అంటున్నారు. ‘ఎటాక్’ మినహా రన్ వే34, చట్ పుట్లీ, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ సినిమాలు ఫ్లాప్ నిలిచాయని, దీంతో రకుల్ 2022లో ఫ్లాప్ యాక్ట్రెస్ గా నిలిచిందని సమీక్షించారు.
 

బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో రకుల్ ప్రీత్ కేరీర్ హిందీలో ముగిసినట్టేనని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉమైర్ ఇచ్చిన రివ్యూ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీంతో రకుల్ ప్రీత్ అభిమానులు కాస్తా ఆందోళన చెందుతున్నారు. మరికొందరు రకుల్ కు బాలీవుడ్ కలిసి రావడం లేదని.. తిరిగి సౌత్ లోనే సినిమాలు చేయాలని అభిప్రాయపడుతున్నారు.
 

ప్రస్తుతం రకుల్ కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘ఇండియన్ 2’ కాగా, సైన్స్ ఫిక్షన్ కామెడీ గా తెరకెక్కనున్న ‘అయలాన్’ మరొక చిత్రం. ఈ రెండు సినిమాలూ గతంలోనే ఒకే అయ్యాయి. ఇటీవల ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ లను కన్ఫమ్ చేయకపోవడం గమనార్హం. 
 

మరోవైపు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. రెడ్ డ్రెస్, క్రేజీ గౌన్ లోనూ అదిరిపోయేలా ఫోజులిచ్చింది. స్టన్నింగ్ స్టిల్స్ తోపాటు గ్లామర్ విందుతో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Latest Videos

click me!