మొహానికి చాక్లెట్.. పైగా ముద్దులు.. రకుల్ ప్రీత్ చిలిపి చేష్టలు చూశారా.. పిక్స్

First Published | Jul 7, 2023, 3:26 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కొన్నిప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా కొన్ని ఫన్నీ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కొన్నేళ్లు తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బడా హీరోల సరసన నటించిన మెప్పించింది. మరోవైపు తన గ్లామర్, నటనతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకుంది.
 

కొన్నేళ్లుగా రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ పోస్టులు పెడుతూ సందడి చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. మరీ ముఖ్యంగా కొన్ని స్పెషల్ పోస్టులతోనూ ఆకట్టుకుంటోంది.
 


ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. ఈ సందర్భంగా రకుల్ కొన్నిఫొటోస్ ను పంచుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా కట్ చేసిన చాక్లెట్ కేక్, ఇక ఆయా సందర్భాల్లో ఎంతో ఇష్టంగా చాక్లెట్, ఐస్ క్రీమ్ తింటున్న పిక్స్ ను షేర్ చేసింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇస్తూ అందరికీ చాక్లెట్ డే శుభాకాంక్షలు కూడా తెలిపింది.  
 

పిక్స్ షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. ‘రుచికరమైన చాక్లెట్ పరిష్కరించలేనిదంటూ ఏదీ లేదు. తినండి కానీ మితంగా తినండి. ప్రపంచ చాక్లెట్ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొంది. మరోవైపు రకుల్ కూ ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు తన ఫొటోస్ ను లైక్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 
 

తాజాగా పంచుకున్న ఫొటోస్ లో రకుల్ చిలిపి ఫోజులతో ఆకట్టుకుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటూ, మొహంపై చాక్లెట్ పూసుకొని ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. మరోవైపు ఫ్లైయింగ్ కిస్సులిస్తూ నెటిజన్లను ఉక్కిబిక్కిరి చేసింది. రకుల్ క్యూట్ ఫొటోస్ కు ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. 
 

తెలుగు సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన రకుల్.. మొన్నటి వరకు బాలీవుడ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’, ‘ఆయలాన్’లో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

Latest Videos

click me!