మేకప్ రూమ్ లో రకుల్ చిలిపి చేష్టలు.. స్టార్ హీరోయిన్ అల్లరి ముమూలుగా లేదుగా.. పిక్స్ వైరల్

First Published | Mar 19, 2023, 4:31 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నెట్టింట మెరిసిన ప్రతిసారి కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా తన వర్క్ ప్లేస్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. తన చిలిపి చేష్టలతో అట్రాక్ట్ చేస్తోంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet singh) తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు దుమ్ముదులిపిన విషయం తెలిసిందే. బడా స్టార్స్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. 
 

తెలుగుతో పాటు తమిళంలోనూ నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నార్త్ లో తెగ సందడి చేస్తోంది. కానీ దక్షిణాది సినిమాలకు కాస్తా దూరమైనందుకు ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. 
 


కానీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆయా ఈవెంట్లలోనూ మెరుస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. 
 

తాజాగా తన వర్క్ ప్లేస్ లో ఎలా ఉంటుందో చూపించేందుకు కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోల్లో రకుల్ మేకప్ రూమ్ లో అల్లరి చేస్తూ కనిపించింది. కాఫీ కప్ చేతిలో పట్టుకొని.. ఫొటోలకు చిలిపిగా ఫోజులిచ్చింది. అల్లరి పనులతో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చేసింది.
 

మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్ లోనూ కట్టిపడేసింది. బ్లూ ప్రింటెడ్ డెనిమ్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించిన రకుల్ స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకుంటూ ‘.. వర్క్ ప్లేస్ లో ఇలా కాఫీని ఎంజాయ్ చేస్తున్నట్టు’ క్యాప్షన్ లో చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం రకుల్ ‘మేరీ పత్నీ కా రీమేక్’, ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. అలాగే ‘అయలాన్’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ వంటి చిత్రాలతో త్వరలో అలరించబోతోంది. ఈ క్రమంలో ఇలా తన వేకేషన్స్, టూర్స్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.  
 

Latest Videos

click me!