రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేస్తూ దూసుకుపోతుంది.
తెలుగులో వరుస పరాజయాలే అందుకు కారణం కావచ్చు. అదే సమయంలో తెలుగు మేకర్స్ సైతం ఈ అమ్మడిని పట్టించుకోకపోవడం కావచ్చు. కానీ రకుల్ తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేస్తుంది.
తాజాగా ఈ భామ ఓ హాట్ ఫోటోని పంచుకుంటూ `ఎప్పుడూ పనులతో బిజీగా ఉండటమే కాదు, అప్పుడప్పుడు మనసారా నవ్వేందుకు కాస్త సమయం ఇవ్వండి` అని పేర్కొంది. ఈ సందర్భంగా బ్లౌజ్ వదులుగా ముడేసి ఎద అందాలు చూపిస్తున్నఫోటోని పంచుకుంది.
మనసారా నవ్వుకోవడం మాట అట్నుంచి ఇప్పుడు నెటిజన్లు రకుల్ అందాలను మనసారా ఆస్వాధించే పనిలో బిజీ అయ్యారని చెప్పొచ్చు. ఇటీవల పంచుకున్న ఈ ఫోటో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే రకుల్ సైతం తన రూట్ మారుస్తోంది. త్వరలో ఆమె డిజిటల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తుంది. ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
తాజాగా పంచుకున్న ఫోటోలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. `సిరీస్ కమింగ్ సూన్` అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇప్పటికే కాజల్, తమన్నా, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా దీనికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 'చెక్' సినిమాతో వచ్చిన రకుల్‌కి ఆ సినిమా ఆశించిన సక్సెస్‌ను ఇవ్వలేకపోయింది. క్రిష్ - వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది.
ఇక బాలీవుడ్‌లో జాన్ అబ్రహాం నటిస్తున్న 'అటాక్' మూవీతో పాటు 'మేడే', 'డాక్టర్ జీ', 'థాంక్ గాడ్' చిత్రాలలో నటిస్తోంది రకుల్. ఈ క్రమంలోనే ఓ కామెడీ వెబ్ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వెల్లడించింది.
తోటి హీరోయిన్లు సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో రకుల్ సైతం వారి బాటలో పయనించేందుకు ప్లాన్ చేసుకుంటుందని చెప్పొచ్చు.