Rakul Fitness Secrete: రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ సీక్రేట్, అందుకే అంత స్లిమ్ గా ఉందట

Published : Jun 19, 2022, 11:23 AM IST

రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కు బ్రాండ్.. జీరో సైజ్ కునిలువెత్తు రూపం. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న బ్యూటీ.. ఈ మధ్య అందరి షాక్ ఇచ్చి స్లిమ్ గా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పటి నుంచీ అలానే మెయింటేన్ చేస్తోంది. ఇంతకీ రకుల్ ప్రీత్ స్లిమ్ సీక్రేట్ ఏంటీ..? ఏం తింటుంది. 

PREV
18
Rakul Fitness Secrete: రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్  సీక్రేట్, అందుకే అంత స్లిమ్ గా ఉందట

హీరోయిన్లకు అన్నింటికంటే ముఖ్యమైనది ఫిల్ నెట్, జీరో సైజ్. ఫిట్ గా.. స్లిమ్ గా ఉంటేనే.. ఏజ్ అయిపోయినా సరే ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నారు స్టార్ బ్యూటీస్. అందులో సమంత,శృతిహాసన్,రకుల్ లాంటి వారు ఫిట్ నెస్ పై గట్టిగా దృష్టి పెడుతుంటారు. ముఖ్యంగా రకుల్ జీమ్ తో పాటు ఫుడ్ విషయంలో తన మార్క్ చూనిస్తుంది. 

28

గతంలో కొంచె బొద్దగా కనిపించిన రకుల్ ప్రీత్.. ఇప్పుడు జీరో సైజ్ బాడీతో రచ్చ చేస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు గుచ్చేలా నాజూగ్గా తయారయ్యింది. ఫిట్ నెస్ మీద ఇంట్రెస్ట్ తో పాటు.. హెల్త్ మీద రకుల్ కు ఉన్న జాగ్రత్తే ఆమెను హెల్దీగా, ఫిట్ గా.. అందంగా ఉండేట్టు చేస్తోంది. 
 

38

ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడదు పంజాబీ బ్యూటీ. జిమ్ టైమింగ్ అంటే టైమింగే.. అస్సలు మిస్ అవ్వదు. జిమ్ లో కూడా అందరిలా కాకుండా డిఫరెంట్ గా వర్కౌట్స్ చేస్తుంది. ఎంత కష్టమైనా సరే.. జిమ్ ను చాలా ఇష్టంగా చేస్తుంది రకుల్. అందుకే అంతలా జీరో సైజ్ ను మెయింటేన్ చేస్తుంది. 

48

జిమ్ మాత్రమే కాదు.. ఏరోబిక్స్, యోగా, డాన్స్, ప్రాణాయమం, ఇలా రకుల్ లిస్ట్ లో చాలా ఉన్నాయి. వేటికి తగట్టు వాటికి  టైమ్ కేటాయిస్తుంది బ్యూటీ. మనసును ప్రశాంతంగా ఉంటుంది. ఫెయిల్యూర్స్ వస్తున్నా.. ప్రెజర్ తీసుకోకుండా కూల్ గా ఉంటుంది బ్యూటీ. 
 

58

 ఫిట్‌నెస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది బల్లే బల్లే బ్యూటీ.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ పంజాబీ భామ డైట్‌ విషయంలో మాత్రం తనకు కచ్చితమైన నియమాలేవీ లేవని అంటున్నది. 

68

రకుల్ ఫుడ్ సీక్రేట్ ఏం లేదు.. నచ్చిన ఆహారం కడుపునిండా తినేయడమే తన డైట్‌ సీక్రెట్‌ అని ప్రకటించింది. అయితే ఎంత ఇష్టంగా తింటుందో అంతే ఇష్టంగా వర్కౌట్స్ చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. 
 

78

జ్యూస్‌ కంటే కూడా డైరెక్ట్ గా  పండ్లు తినడమే  తనకు ఇష్టమని చెబుతున్నది. అలా అయితేనే, వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయంటూ తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని వెల్లడించింది. గుజరాతీ థాలీ, గులాబ్‌ జామూన్‌, ఆలూ పరాటా రకుల్‌కి బాగా ఇష్టమైన రుచులు. రెస్టారెంట్లు, స్టార్‌ హోటల్స్‌తో పోలిస్తే.. ఇంటి భోజనమే తనకు ప్రాణమని అంటున్నదీ సొగసరి.
 

88

తిండి విషయంలో ఎక్కడా తగ్గకూండదు.. అలాగే ఫిట్ నెస్ విషయంలో.. జిమ్ విషయంలో కూడా తగ్గేదే లే అంటోంది బ్యూటీ. అందుకే 3 పదుల వయస్సు దాటినా.. ఇంకా హీరయిన్ గా అవకాశాలు సాధిస్తూనే ఉంది. ముందు ముందు కూడా తన సత్తా ఏంటో చూపిస్తానంటోంది. 

click me!

Recommended Stories