రాధిక, చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, దొంగమొగుడు, యమకింకరుడు, రాజా విక్రమార్క, హీరో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ చాలా మంది యువతకు ఇప్పటికీ ఫేవరిట్ గా ఉంటాయి. అంతలా చిరు, రాధిక జంట మ్యాజిక్ చేసింది. ప్రస్తుతం రాధిక తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తోంది. రీసెంట్ గా రాధిక.. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించింది.