గ్రాండ్ గా ‘పుష్ఫ 2’ పూజా కార్యక్రమం.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది?

Published : Aug 22, 2022, 02:36 PM IST

‘పుష్ఫ : ది రూల్’ చిత్ర పూజా కార్యక్రమాన్ని ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించారు. శుభ ముహూర్తాన సీక్వెల్ ప్రారంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, మేకర్స్, చిత్ర యూనిట్ పాల్గొంది.    

PREV
16
గ్రాండ్ గా ‘పుష్ఫ 2’ పూజా కార్యక్రమం.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి ‘పుష్ఫ : ది రైజ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా దీనికి సీక్వెల్ గా వస్తున్న Pushpa The Rule చిత్ర పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా  నిర్వహించారు. 

26

సీక్వెల్ ఎప్పుడు ప్రారంభం కానుందోనని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, అభిమానులు ఈరోజు గ్రాండ్ గా జరిగిన ‘పుష్ఫ : ది రూల్’ పూజా వేడుకలతో కాస్తా ఖుషీ అవుతున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, చిత్ర యూనిట్ తోపాటు మూవీ మేకర్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు కెమెరా స్విచ్ ఆన్ చేసి, క్లాప్ కొట్టి ముహుర్తపు షాట్ ను ప్రారంభించారు. 

36

ఈ పూజా కార్యక్రమానికి అల్లుు అర్జున్ హాజరుకాలేకపోయారు. అమెరికాలో న్యూయార్క్ లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్వహించిన ‘ఇండియా డే’ పరేడ్ కు దేశం తరుఫున ప్రాతినిథ్యం వహిస్తూ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. దీంతో అల్లు అర్జున్ రాలేకపోయాడు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కూడా షూటింగ్ బిజీతో హాజరు కాలేకపోయింది.
 

46

పూజా కార్యక్రమాలతో అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన ‘పుష్ఫ’ సీక్వెల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే  లోకేషన్స్,  స్టార్ కాస్ట్ ల ఎంపిక, బడ్జెట్ అంచనాలతో పాటు పూర్తి స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ యూఎస్ లో ఉంటడటంతో  ఆయన తిరిగి ఇండియాకు రాగానే రెగ్యులర్ షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నట్టు సమాచారం. 
 

56

మొత్తంగా వచ్చే నెలలోనే సీక్వెల్ షూటింగ్ జరగబోతందని తెలుస్తోంది. ఈసారి కూడా రష్మిక మందన్న, అల్లు అర్జున్ జంటగా నటిస్తున్నారు. విలన్ ప్రాతను ఫహద్ ఫాసిల్ పోషిస్తున్నారు. పలు కీలక పాత్రల్లో సమంత, ప్రియమణి కనిపించనున్నట్టు తెలుస్తోంది. సంగీత దర్శకుడు  దేవీ శ్రీప్రసాద్ మరోసారి అద్భుతమైన మ్యూజిక్ తో ఆకట్టుకోనున్నాడు. 

66

తెలుగుతో పాటు నార్త్ లోనూ అత్యధికంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘పుష్ఫ’. అటు వసూళ్లలోనూ Pushpa బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం బడ్జెట్టే రూ.350 కోట్ల వరకు  ఉండటనుందని సమాచారం. ఇక పుష్ఫ రాజ్ ను సీక్వెల్ లో గ్రాండ్ గా  చూపించబోతున్నారంట సుకుమార్. దీంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories