గ్లోబల్ స్టార్ నయా లుక్ చూశారా..వైట్ డ్రెస్ లో చూపు తిప్పుకోలేని విధంగా ప్రియాంక చోప్రా ఫోజులు

Published : Mar 15, 2024, 02:23 PM IST

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది.

PREV
19
గ్లోబల్ స్టార్ నయా లుక్ చూశారా..వైట్ డ్రెస్ లో చూపు తిప్పుకోలేని విధంగా ప్రియాంక చోప్రా ఫోజులు

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. హాలీవుడ్ అభిమానులని సైతం తన అందంతో సమ్మోహనం పరుస్తోంది.

29

ఈ మాజీ విశ్వ సుందరి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. 40 ఏళ్ల వయసులో ప్రియాంక చెక్కు చెదరని సొగసుతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది.

 

39

 తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. 

49

ఇంటర్నేషనల్ మూవీ ఈవెంట్స్ లో ప్రియాంక హాలీవుడ్ భామలని  సైతం డామినేట్ చేస్తూ అందంతో మెప్పించడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాగా తగ్గించింది. తన భర్త నిక్ జోనస్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. 

59

అప్పుడప్పుడూ ప్రియాంక తన భర్తతో కలసి ఇండియాకి వస్తూ ఉంటుంది. ఈ జంటకి ఒక కుమార్తె సంతానం కలిగిన సంగతి తెలిసిందే. సరోగసి విధానం ద్వారా ప్రియాంక, నిక్ జోనస్ కుమార్తెకి తల్లిదండ్రులయ్యారు. 

69

ప్రియాంక చోప్రా ఎక్కడ కనిపించినా ఆమె ధరించే దుస్తులు, ఆభరణాలు అందంగా ఉండడం మాత్రమే కాదు. ఎంతో ఖరీదైనవిగా కూడా ఉంటాయి. 

79

తాజాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రియాంక ఎప్పటిలాగే అదిరిపోయే కాస్ట్యూమ్ లో సర్ప్రైజ్ చేసింది. 

 

89

కంప్లీట్ వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపించింది. ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ఎక్కడికి వెళ్ళిననా జంటగా దర్శనం ఇస్తారు. ప్రియాంక గ్లోబల్ బ్యూటీ కాబట్టి ఎక్కడికి వెళ్లినా తన మార్క్ స్టైల్, గ్లామర్ ఉండాలని కోరుకుంటుంది. 

99

ప్రియాంక లేటెస్ట్ ఫొటోస్ లో చిరునవ్వులు చిందిస్తూ అందంగా మెరిసింది. అయితే ఆమె నయా లుక్ సర్ప్రైజింగ్ గా ఉంది. ప్రియాంక సరికొత్త లుక్ లో అలరిస్తోంది. 

 

click me!

Recommended Stories