ప్రియాంక చోప్రా, రిచర్డ్ మెడాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బడ్జెట్ పరిమితికి మించి ఈ వెబ్ సిరీస్ కోసం అమెజాన్ సంస్థ ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా, రిచర్డ్ మెడాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బడ్జెట్ పరిమితికి మించి ఈ వెబ్ సిరీస్ కోసం అమెజాన్ సంస్థ ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ సిటాడెల్ కి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి సిటాడెల్ విమర్శలు ఎదుర్కొంటోంది.
26
అమెరికాలో టాప్ షోల లిస్ట్ లో సిటాడెల్ లేకపోవడం వల్ల అమెజాన్ సంస్థకి భారీగా నష్టాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సి గగ్గోలు పెడుతున్నట్లు తెలుస్తోంది. సిటాడెల్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో ఆండీ జెస్సి ప్రస్తుతం అమెజాన్ నిర్మిస్తున్న అన్ని షోల బడ్జెట్ వివరాలపై అనాలసిస్ మొదలు పెట్టారట. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
36
Citadel trailer
సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం అమెజాన్ సంస్థకి దాదాపు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 2000 కోట్లు) ఖర్చయినట్లు తెలుస్తోంది. కానీ సిటాడెల్ కి వస్తున్న స్పందన చూస్తుంటే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. సిటాడెల్ తో అమెజాన్ జోరుకి ఒక్కరిగా బ్రేకులు పడ్డట్లు అయింది.
46
గత 9 నెలల్లో అమెజాన్ నిర్మించిన 6 బిగ్ షోలకి ఫెయిల్యూర్ రెస్పాన్స్ వస్తోంది. వీటిపై కూడా ఆండీ జెస్సి కింది స్థాయి ఎంప్లాయీస్ ని నివేదిక అడిగారట. దీని ఫలితం అమెజాన్ ఉద్యోగులపై కూడా పడుతోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ ల నష్టాల కారణంగా.. డిమాండ్ లేని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్న 10 వేల మంది ఉద్యోగులని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
56
Image: Priyanka Chopra / Instagram
వాస్తవంగా సిటాడెల్ సిరీస్ ని 8 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్ పరిమితి మించిపోవడంతో 6 ఎపిసోడ్స్ కే చాప చుట్టేశారని విమర్శలు కూడా ఉన్నాయి. గత కొన్ని నెలల్లో అమెజాన్ సంస్థ డైసీ జోన్స్ అండ్ ది సిక్స్, ది పవర్, డెడ్ రింగ్స్, ది పెరిఫెరల్ లాంటి షోలని ఒక్కొక్క దానిని 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించింది. కానీ ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. వీటన్నింటికీ తోడు సిటాడెల్ పెద్ద పిడుగులా అమెజాన్ నెత్తిన పడింది.
66
ఇండియాలో ప్రియాంక చోప్రాకి ఉన్న క్రేజ్ కారణంగా సిటాడెల్ కాస్త పర్వాలేదనిపించింది. కానీ విదేశాల్లో ఈ షో పూర్తిగా ఆదరణ కరువైనట్లు తెలుస్తోంది. దీనితో అమెజాన్ సంస్థ నష్టాలని పూడ్చుకునే పనిలో ఉంది.