Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 29వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దివ్య (Divya) పక్కన తులసి అలారం పెట్టి వెళుతుంది. దాంతో దివ్య మేల్కొని వాళ్ల మమ్మీ పై కోపం పడుతుంది. అంతేకాకుండా వాళ్ల తాతయ్య నాయనమ్మల కు టీ ఇవ్వమని దివ్య పక్కన ఒక స్లిప్ లో రాసి తులసి (Tulasi) పొద్దుపొద్దున్నే బయటకు వెళుతుంది.
26
తులసి (Tulasi) ఇంత పొద్దున్నే బయటికి వెళ్ళడం ఏమిటి? అని ఇంట్లో వాళ్ళు ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇక మరోవైపు తులసి పార్కులో వాళ్ళ ఫ్రెండ్ ప్రవళిక ను కలుసుకుంటుంది. ఇక తులసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తం తన ఫ్రెండ్ తో పంచుకుంటుంది. ఇక ప్రవళిక (Pravalika) తులసికి జీవితమంటే ఏంటో వివరించి తులసికి జ్ఞానోదయం అయ్యేలా చేస్తుంది.
36
అంతేకాకుండా పెళ్లికి ముందు నువ్వు ఏ కలలు కనలేదా? నీకు ఎలాంటి కష్టాలు లేవా.. అని ప్రవళిక (Pravalika) తులసిని అడుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనం బయటకు వెళ్తున్నాము అని అంటుంది. మరోవైపు అంకిత మీ అమ్మకు దూరంగా నువ్వు ఉండగలుగుతున్నావేమో.. నేను మా అత్తయ్యకు దూరంగా ఉండలేకపోతున్నాను అని అభి (Abhi) మీద కోపం పడుతుంది.
46
మరోవైపు శృతి (Shruthi) కి అలిసిపోయి కళ్ళు తిరుగుతూ ఉండగా.. ప్రేమ్ (Prem) నువ్వు రెస్ట్ తీసుకో అని ఇంట్లో పనులు మొత్తం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తానే స్వయంగా వంట చేసి శృతి కు ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తాడు. దాంతో శృతి ఎందుకు మీకు ఇంత శ్రమ అన్నట్లు మాట్లాడుతుంది.
56
ఇక ఇంట్లో దివ్య (Divya), అనసూయ కలిసి తులసి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ లోపు తులసి వస్తుంది. అనసూయ (Anasuya) చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. వాకింగ్ కు వెళ్ళాను అని తులసి నవ్వుకుంటూ చెబుతుంది. దాంతో దివ్య అనసూయలు ఆశ్చర్య పోతూ ఉంటారు.
66
ఇక తరువాయి భాగం లో ప్రవళిక ఈరోజు మొత్తం మీ మమ్మీ నాతో స్పెండ్ చేస్తుందని దివ్య (Divya) దగ్గర పర్మిషన్ తీసుకుని తులసి ను షాపింగ్ కి తీసుకొని వెళుతుంది. అంతేకాకుండా అక్కడ తులసి (Tulasi) కి డ్రెస్ కొనిపించి తులసి చేత డ్రెస్ వేపిస్తుంది. ఇక డ్రెస్ లో తులసి ఎలా ఉంటుందో రేపటి భాగంలో చూడాలి.