Poorna: విరహం తట్టుకోలేక ఢీ పూర్ణ హాట్‌ పోజులు.. సుధీర్‌తో చూసి ఆఫర్ ఇచ్చారట..బాలయ్యపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్

First Published | Nov 29, 2021, 5:05 PM IST

`ఢీ` పూర్ణ బోల్డ్ నెస్‌కి మారుపేరుగా నిలుస్తుంది. స్కిన్‌ షో విషయంలో హద్దులు దాటకుండానే, లిమిటేషన్స్ లోనూ అన్‌లిమిటెడ్‌ సెక్సీ నెస్‌ని చూపిస్తుంది. హాట్‌ హాట్‌ పోజులతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్‌ మీడియాని ఊర్రూతలూగిస్తుంది. 

తాజాగా Poorna బ్లూ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. మతిపోగొట్టే పోజులతో నెట్టింట దుమారం రేపుతుంది. పూర్ణ ఇచ్చిన ఫోటో షూట్‌ ఫోటోలు(Poorna Hot Photos) విజువల్‌ ఫీస్ట్ లాగా ఉన్నాయి. దీంతో ఇంటర్నెట్‌లో కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. పూర్ణ అంటేనే ఒక మత్తు. అలాంటిది విరహాలతో కూడిన ఇలాంటి సెక్సీ పోజులిస్తే ఇక వాళ్లు మత్తులో చిత్తైపోతుంటారు. ఇప్పుడు పూర్ణ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లకి అలాంటి మత్తునే ఇస్తుంది. దీంతో సోషల్‌ మీడియాలో పూర్ణ గ్లామర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా పూర్ణ ఒక అద్భుతమైన కామెంట్‌ పెట్టింది. `నేను నాలా ఉంటాను. వేరే ఏ ఒక్కరిలా ఉండేందుకు ప్రయత్నించను` అని పేర్కొంది. మంచైనా, చెడైనా తనకు నచ్చినట్టే ఉంటానని, తన కంఫర్ట్స్ ని మిస్‌ చేసుకోనని తెలిపింది. గ్లామర్‌ విషయంలో తనకి ఏది కంఫర్ట్ గా ఉంటే అలానే ఉంటాననే విషయాన్ని వెల్లడించింది పూర్ణ. ఆమె పోస్ట్ కి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. 


ఇదిలా ఉంటే ప్రస్తుతం పూర్ణ.. బాలయ్య హీరోగా రూపొందిన `అఖండ`(Akhanda) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా పూర్ణ సోమవారం మీడియాతో ముచ్చటించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలయ్యతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకుంది. బాలయ్యతో సీన్‌ అంటే ముందు టెన్షన్‌ పడిందట. కానీ సెట్లో ఆయన వాతావరణంతో వెంటనే ఫ్రీ అయిపోయానని తెలిపింది. సెట్‌లో ఆయన ఎంతో సరదాగా ఉంటారని చెప్పింది. 
 

సినిమాలో బాలయ్య రెండు పాత్రలతో తనకు సన్నివేశాలుంటాయని, ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఓ గాడ్‌తో సినిమా చేస్తున్నట్టు ఉంటుందని తెలిపింది. తాను బాలయ్యకి, విలన్‌ అయిన శ్రీకాంత్‌కి మధ్య సంఘర్షణని తెలియజేసేలా, ఆ ఘర్షణకి వారధిగా ఉంటానని తెలిపింది. హెల్త్ మినిస్టర్‌ పాత్రలో కనిపిస్తానని చెప్పింది. తన పాత్ర చాలా హుందాగా, మెచ్యూర్‌గా ఉంటుందని ఓ కొత్త తరహా పాత్రలో తాను కనిపించబోతున్నట్టు చెప్పింది. 
 

కెరీర్‌ పరంగా `అఖండ` తనకు చాలా ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో తన కెరీర్‌ పుంజుకోవడానికి `ఢీ`డాన్స్ షోనే కారణమని తెలిపింది పూర్ణ. కెరీర్‌ డల్‌ అయిన సందర్భంలో తాను `ఢీ` షోకి జడ్జ్ గా చేశానని, అక్కడ తనకు మంచి గుర్తింపు, ఫాలోయింగ్‌ ఏర్పడిందని చెప్పింది. `ఢీ` షో తన కెరీర్ కి చాలా ప్లస్‌ అయ్యిందని పేర్కొంది.

ఓ సందర్భంలో `ఢీ` షోలో సుడిగాలి సుధీర్‌తో స్టేజ్‌పై తమ మధ్య జరిగిన సన్నివేశాలను చూసి ఓ దర్శకుడు `పవర్‌ ప్లే` సినిమాలో ఆఫర్‌ ఇచ్చారని తెలిపింది పూర్ణ. అలా `ఢీ` తన కెరీర్ కి బూస్టప్‌ ఇచ్చినట్టు చెప్పింది. అదే సమయంలో టీవీ, సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్ పెంచిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. 
 

గ్లామర్‌ పరంగా తాను ఎప్పుడూ హద్దులు మీరలేదని, తనకు కంఫర్ట్ అనిపించిన డ్రెస్సులే వేస్తానని తెలిపింది. అయితే ఈ లిమిటేషన్స్ వల్ల కొన్ని ఆఫర్లు కూడా మిస్‌ అయ్యాయని, కానీ అది తనకు నచ్చనిదే కదా అని లైట్‌ తీసుకున్నట్టు చెప్పింది. మరోవైపు ఇటీవల `3రోజెస్‌`లో కూడా తాను నటించానని, అందులో మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించాను గానీ, ఎక్కడా హద్దులు మీరలేదని తెలిపింది. 

తాను అందరు హీరోయిన్లలా కాదని, తనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పింది. హీరో పక్కన డ్యూయెట్‌ పాడే నటిగా కాదని చెప్పింది. తనకు అవి సెట్‌ కాదని, తన జోనర్‌ డిఫరెంట్‌ అని చెప్పింది. సినిమాల్లో కీలక పాత్రలు పోషించాలనుకుంటున్నట్టు, స్ట్రాంగ్‌ రోల్స్ కి ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్పింది. `ఆఖండ`లో తన పాత్ర బలంగా ఉంటుందని చెప్పింది. 
 

మరోవైపు ఇటీవల `దృశ్యం2`లో చిన్న పాత్రలో లాయర్‌గా కనిపించాను. అది చూసి చాలా మంది సర్‌ప్రైజ్‌ అయ్యారు. లాయర్‌గా కనిపించడం పట్ల మంచి ప్రశంసలు దక్కినట్టు చెప్పింది పూర్ణ. ప్రస్తుతం కొన్ని వెబ్‌ సిరీస్ లకు కూడా డిస్కషన్‌ జరుగుతున్నాయని వెల్లడించింది. 
 

తెలుగు తమిళం, కన్నడ, మలయాళం నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని, ప్రస్తుతం ఓ ఎగ్జైటింగ్‌ అనౌన్స్ మెంట్ ఉందని అది యూనిట్‌ చెబుతుందని తెలిపింది. మున్ముందు మరిన్ని మంచి సినిమాల్లో భాగం కాబోతున్నట్టు తెలిపింది పూర్ణ. 
 

ప్రస్తుతం పూర్ణ తెలుగులో `అఖండ`తోపాటు బ్యాక్‌ డోర్‌`, `తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ`, `తీస్‌మార్‌ ఖాన్‌`, తమిళంలో `పదం పెసుమ్‌`, `పిసాసి 2`, `అమ్మాయి`తోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది.

also read: Deepika Pilli: నాజూకైన ఒంపులతో దీపికా పిల్లి అందాల మాయ.. ఆగలేకపోతున్న కుర్రాళ్లు

Latest Videos

click me!