ఆ ఇద్దరి వల్ల నలిగిపోయిన పూజా హెగ్డే.. పాపం సెట్‌ చేసుకోవడానికి ఎంత కష్టపడుతుందో?

Published : Jul 07, 2023, 06:15 PM IST

టాలీవుడ్‌ బుట్టబొమ్మ.. పూజా హెగ్డే మొన్నటి వరకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, బిజీ హీరోయిన్‌. ఆమె కోసం హీరోలు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. ఆమె బిజీగానే ఉంది, కానీ డిస్టర్బెన్స్ మాత్రం గట్టిగా జరిగింది. 

PREV
16
ఆ ఇద్దరి వల్ల నలిగిపోయిన పూజా హెగ్డే.. పాపం సెట్‌ చేసుకోవడానికి ఎంత కష్టపడుతుందో?

పూజా హెగ్డే కెరీర్‌.. ప్రారంభంలో రెండుమూడేళ్లు కాస్త స్ట్రగుల్‌ అయ్యింది. తొలుత నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమెకి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు.  `ముకుంద`, `ఒక లైలాకోసం` చిత్రాలతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పూజా. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ హృతిక్‌ రోషన్‌తో `మెయింజోదారో` చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆడలేదు. దీంతో అయోమయ పరిస్థితుల్లో ఆమెని బన్నీ ఆదుకున్నారు. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన `డీజే`(దువ్వాడ జగన్నాథమ్‌) సినిమా మంచి హిట్‌ అయ్యింది. ఇందులో బన్నీ, పూజాల మధ్య కెమిస్ట్రీ, పాటలు హైలైట్ గా నిలిచాయి. ఇందులో పూజా డాన్సులు సైతం వాహ్‌ అనిపించేలా ఉన్నాయి. ఆమె అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. దీంతో ఒక్కసారిగా పూజా కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుంది. ఆమెకి పెద్ద ఆఫర్లు ప్రారంభమయ్యాయి. 
 

26

ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`, మహేష్‌తో `మహర్షి`, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో `సాక్ష్యం`, వరుణ్‌ తేజ్‌తో `గద్దల కొండ గణేష్‌`, బన్నీతో `అలా వైకుంఠపురములో`, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`, విజయ్‌తో `భీస్ట్`, రామ్‌ చరణ్‌తో `ఆచార్య` వంటి సినిమాలు చేసింది. చివర్లో నటించిన `రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలు గట్టిగా దెబ్బకొట్టాయి. దీంతో ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్‌గా ముద్ర పడింది. దీని ప్రభావం కెరీర్‌పై పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె ఎఫెక్ట్ అయ్యింది. 

36

అదెలా అంటే.. మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే `గుంటూరు కారం` చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకున్నారు. అది ఎప్పుడో ప్రకటించారు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలోనూ పూజానే హీరోయిన్‌ అని అనుకున్నారు. ఓ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్‌ శంకర్‌ కూడా అదే విషయాన్ని ప్రకటించారు. కానీ మహేష్‌కి, త్రివిక్రమ్‌కి మధ్య ఏర్పడిన బేధాభిప్రాయల వల్ల `గుంటూరు కారం` సినిమా వాయిదా పడుతూ, స్టార్ట్ అవుతూ, వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు మహేష్‌ ఇంట్లో విషాదాలు సైతం సినిమా డిలేకి కారణమయ్యింది. 
 

46

అంతేకాదు.. పూజా విషయంలోనూ త్రివిక్రమ్‌, మహేష్‌బాబు మధ్య విభేదాలు తలెత్తాయట. ఆమె ఫెయిల్యూర్‌లో ఉందని, వద్దని మహేష్‌ ఒత్తిడి పెంచడం, ముందుగా కమిట్‌ అయ్యింది కాబట్టి కాదలేని పరిస్థితిలో త్రివిక్రమ్‌ ఉన్నారని, దీనిపై ఇద్దరి మధ్య బాగానే ఇష్యూ జరిగిందని, కోల్డ్ వార్‌ సైతం పలు రూపాల్లో బయటకు వచ్చిందని అన్నారు. సోషల్‌ మీడియాలోనూ ఆ ప్రచారం జరిగింది. సినిమా ప్రారంభం కావాలంటే పూజా ఉండాలా? లేదా? అనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో.. బుట్టబొమ్మ ఈ సినిమా నుంచి తప్పుకుంది. అటు మహేష్‌బాబు, ఇటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ వల్ల చాలా రోజులు పూజా నలిగిపోయింది. 
 

56

అది `గుంటూరు కారం` వరకే పరిమితం కాదు, ఈ సినిమా ప్రభావం ఆమె కెరీర్‌పై, కాల్షీట్లపై కూడా పడింది. ఈ సినిమా కోసం పూజా చాలా ఇతర ప్రాజెక్ట్ లకు నో చెప్పింది. అనేక యాడ్స్ కి నో చెప్పింది. ఈ సినిమా కోసం దాదాపు 40 డేస్‌ కాల్షీట్లు వేస్ట్ అయ్యాయట. కేవలం  పది రోజులు మాత్రమే షూట్‌ చేశారని, మిగిలిన 30 రోజులు వేస్ట్ అయిపోయాయని తెలుస్తుంది. చివరికి ఇప్పుడు ఆ సినిమానే లేకుండా పోయింది. మొత్తంగా దాదాపు రెండు నెలలు ఈ సినిమా కోసం పూజా వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో మిగిలిన సినిమాలకు కాల్షీట్లు అడ్జెస్ట్ చేసుకోలేక వాటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది
 

66

పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ కాంబోలో వస్తోన్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా కూడా దీని కారణంగానే మిస్‌ అవుతుందని అంటున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ని బట్టి ఆమె ఈ సినిమాలో నటించాలా? లేదా అనేది క్లారిటీ రానుందని తెలుస్తుంది. మరోవైపు డేట్స్ కారణంగానే విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ సినిమా కూడా మిస్ అయ్యిందని టాక్.  ప్రస్తుతానికి పూజా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ అంతటికి కారణం మహేష్‌-త్రివిక్రమే కారణమని అంటున్నారు. మొత్తంగా ఇద్దరి మధ్య పూజా నలిగిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ కన్నడ సినిమా, ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తుందట. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories