పట్టుచీరలో కట్టిపడేస్తున్న పూజా హెగ్దే.. చీరకట్టులో వెలిగిపోతూ.. మైమరిపిస్తున్న బుట్టబొమ్మ అందం

First Published | Jan 31, 2023, 5:25 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం తన సోదరుడి పెళ్లి వేడుకల్లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా పట్టుచీరలో మెరిసిపోతోంది. కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) సోదరుడి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూజా హెగ్దే కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలు జరిగాయి.
 

ఈ సందర్భంగా పూజా హెగ్దే ఖరీదైన పట్టుచీరలో మెరిసింది. తన సోదరుడు రిషబ్ హెగ్దే పెళ్లి వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో కట్టిపడేసింది. అప్పటికే సౌందర్యంతో ఆకట్టుకునే బుట్టబొమ్మ సంప్రదాయ దుస్తుల్లో మరింతగా వెలిగిపోతోంది.
 


ఇప్పటికే ఆమె సోదరుడి వెడ్డింగ్ పిక్స్ ను షేర్ చేసుకున్న పూజా హెగ్దే తాజాగా తన వెడ్డింగ్ లుక్ కు సంబంధించిన కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. చీరకట్టులో హోయలు పోతూ ఆకట్టుకునే పోజులిచ్చింది.

ఎర్రటి పట్టుచీర, ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలు ధరించి.. పెళ్లి కూతురిలా ముస్తాబైంది పూజా. నడుముకు వడ్డాణం, మెడకు అందం తెచ్చేలా నెక్లెస్ పెట్టుకుని మరింత అందాన్ని సొంతం చేసుకుంది. 

సంప్రదాయ దుస్తుల్లో పూజా హెగ్దేను చూడగానే జిగేలు మనే అందాలతో మంత్రముగ్ధులను చేసేస్తోంది. మందహాసంతో కుర్ర గుండెల్ని కొల్లగోడుతోంది. మత్తు కళ్లతో ఓరగా చూస్తూ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది.

తాజాగా పంచుకున్న ఈ ఫొటోలు కొద్ది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు పూజాను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక పూజా హెగ్దే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ’ఎస్ఎస్ఎంబీ28‘లో నటిస్తోంది. అటు సల్మాన్ ఖాన్ తోనూ ’కిసి కి బాయ్ కిసి కా జాన్‘లో ఆడిపాడింది. రీసెంట్ విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

Latest Videos

click me!