ఆయన ఉన్నాడనేనా బుట్టబొమ్మ ధైర్యం.. వెకేషన్ లో పూజా హెగ్దే ఫుల్ ఎంజాయ్.. స్లీవ్ లెస్ టాప్ లో మెరుపులు..

First Published | Apr 29, 2023, 6:49 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. ఫుల్ చిల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా నటించిన చిత్రం Kisi Ka bhai Kisi ki Jaan. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించింది. చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్డ్స్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.

చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’పై ఆశలు పెట్టుకుంది. కానీ పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. మరోవైపు ఈ ముద్దుగుమ్మ నటించిన ‘రాధే శ్యామ్, ఆచార్య, సర్కస్’ చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ గానే మిగిలాయి.
 


ఈ పరిణామాల మధ్య బుట్టబొమ్మ కేరీర్ కాస్తా ఆందోళనకరంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు సాలిడ్ హిట్ పడకపోతే ఆమె గ్రాఫ్ పడిపోయే ప్రమాదం కూడా ఉందంటూ అనుకుంటున్నారు. ఈ సమయంలో పూజా హెగ్దేను ఆయనే కాపాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందంటున్నారు. 

ఆయనంటే మరెవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అనే అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న SSMB28లో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమాపైనే పూజా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠపురం’తో సక్సెస్ అందించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో త్రివిక్రమ్ మరోసారి సక్సెస్ అందిస్తాడని ఆశిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత Trivikram, Mahesh Babu కాంబో సెట్ కావడం, పైగా మహేశ్ సరసన పూజాకు రెండోసారి నటించే ఛాన్స్ దక్కడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ కు కూడా వేరే లెవల్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో శ్రీలీలా కూడా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.
 

ఇదిలా ఉంటే.. పూజా హెగ్దే మాత్రం ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. శ్రీలంకకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడి నుంచి తన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. తాజాగా క్యాజువల్ వేర్ లో ఆకట్టుకుంది.  బీచ్ లో తిరుగుతూ రచ్చ  చేసింది. అదిరిపోయే ఫోజులతో కట్టిపడేసింది.  ప్రస్తుతం పిక్స్ వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!