హీరోయిన్ పై లాడ్జ్ ఓనర్ పోలీస్ కంప్లైంట్! పొలిటీషియన్ వాడుకుని వదిలేశాడంటూ..

తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న  విజయలక్ష్మీపై  లాడ్జ్ ఓనర్ పోలీస్ కేసు పెట్టారు. తెలుగు మరియు తమిళంలో అనేక  సినిమాల్లో నటించి మెప్పించిన  విజయలక్ష్మి కొన్ని రోజుల క్రితం తనను ఒక రాజకీయ నేత సోషల్ మీడియా ద్వారా వేదిస్తున్నాడు అంటూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆత్మహత్య విషయం వారం రోజుల పాటు మీడియాలో హడావుడిని సృష్టించింది. తెలుగు మీడియా కూడా ఆమె ఆత్మహత్య యత్నంను ఫుల్ గా  కవర్ చేసింది. ఆ వివాదం నుంచి బయిటపడక ముందే విజయలక్ష్మి ఇప్పుడు మరో వివాదంతో మీడియా ముందుకు వచ్చింది. ఈసారి తనంతట తాను కాకుండా ఒక లాడ్జ్ ఓనర్ ఆమెపై కేసు పెట్టడం వల్ల మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు తమిళ మీడియా మొత్తం ఆమె మీదే కాన్సర్టేట్ చేసింది. ఇంతకీ వివాద విషయం ఏమీటి అంటే..
 

పొలిటీషన్ వాడుకుని వదిలేసాడనిఅయితే విజయలక్ష్మి ఇటీవల ఓ రాజకీయ నాయకుడిపై వివాదాస్పద ఆరోపణలు చేయడం ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారు. నామ్ తమీజర్ కచ్చి నేత సీమాన్‌తో నాకు అఫైర్ ఉంది. తనను వాడుకొని వదిలేశాడు అన్నారు.
తనను నమ్మించి మోసం చేశాడు అంటూ ఆరోపణలు చేయడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చిన ఈ నటి తిరువన్‌మియూర్ అనే లాడ్జిలో ఉంటున్నారు.

అలాగే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెడుతున్నారని సీమాన్‌‌పై భగ్గుమన్నది. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్ర పన్నారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. రాజకీయ నేత సీమాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో చెన్నైలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేసుకోవడం మరో వివాదానికి తెరలేపినట్లైంది.
తిరువన్‌మియూర్‌లోని లాడ్జి యజమాని తాజాగా విజయలక్ష్మిపై పోలీస్ కేసు నమోదు చేశారు. కొద్దినెలలుగా తనకు అద్దె చెల్లించడం లేదు. దాదాపు 3 లక్షల రూపాయలు నాకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని ఆమె నుంచి ఇప్పించండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాడ్జి యజమాని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆ లాడ్జ్ లోనే ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. లాడ్జ్ యజమాని గత కొన్ని నెలలుగా తనకు చెల్లించాల్సిన అద్దె చెల్లించకుండా విజయలక్ష్మి ఇబ్బంది పెడుతుందని.. తనకు రావాల్సిన మొత్తం రూ.3 లక్షల అద్దెను చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
లాడ్జ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మిని విచారించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ కేసు విషయమై ఇప్పటి వరకు విజయలక్ష్మి నుండి స్పందన రాలేదు. ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తమిళంలో స్టార్ హీరోలు విజయ్, సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ అనే చిత్రంతో విజయలక్ష్మీ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత దక్షిణాదిలో తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటించారు. అయితే వ్యక్తిగత జీవితంలో రకరకాల సమస్యల్లో కూరుకుపోయి హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు.

Latest Videos

click me!