హరీశ్ శంకర్ ను వెయింటింగ్ లో పెట్టిన పవన్.. ‘భవదీయుడు భగత్ సింగ్’ ఉంటుందా? ఆలస్యానికి కారణమేంటీ?

Published : Jun 04, 2022, 01:52 PM ISTUpdated : Jun 04, 2022, 01:57 PM IST

పవన్ కళ్యాణ్ ప్రధాన  పాత్రలో, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’. ఈ చిత్రం ప్రకటించి నెలలు గడిచినా సెట్స్ మీదికి మాత్రం వెళ్లలేదు. ఇంకా  హరీశ్ ను వెయిట్ చేయిస్తూనే ఉన్నారు పవన్..  పలు కారణాలతో చిత్రం ఆలస్యం అవుతూనే ఉంది.

PREV
18
హరీశ్ శంకర్ ను వెయింటింగ్ లో పెట్టిన పవన్.. ‘భవదీయుడు భగత్ సింగ్’ ఉంటుందా? ఆలస్యానికి కారణమేంటీ?

గబ్బర్ సింగ్ లాంటి మాస్ కంటెంట్ సినిమా తర్వాత డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కాంబినేషనల్ లో రాబోతున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadeeyudu Bhagat singh). ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. సెట్స్ పైకి వెళ్లేందుకు చిత్ర యూనిట్ కూడా సిద్ధంగా ఉంది.
 

28

కానీ, షూటింగ్ ప్రారంభంపై ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో పదేండ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఆడియెన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ, ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్ర  షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.
 

38

మూడేండ్ల కింద 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంలో వరుసగా నాలుగైదు చిత్రాలు పవన్ ప్రకటించగా... వాటిలో హరీష్ శంకర్ మూవీ ఒకటి. ఇఫ్పటికే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. 
 

48

దీంతో హరీశ్ -పవన్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందన ఫ్యాన్స్, ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరీశ్ శంకర్ ను వెయిట్ చేయిస్తూ ‘భీమ్లా నాయక్’ తర్వాత క్రిష్ జాగర్లముడితో ‘హరి హర వీర మల్లు’ చిత్ర షూటింగ్ కు ఓకే చెప్పాడు. ఇదొక హిస్టారికల్ మూవీ కావడంతో పవన్ కాస్తా సమయం 

58


Hari Hara Veera Mallu కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంటున్నాడు. సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. అయితే ‘హరిహర వీరమల్లు’ మరియు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు రెండు పార్లల్ గా షూటింగ్ జరుపుకోవాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ పవన్ అటు పొలిటికల్ కేరీర్ పైనా శ్రద్ధ చూపుతుండటంతో ఒక సినిమాకు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 

68

మిగతా సమయంలో పవన్ జనసేన తరుఫున రైతు ఓదార్పు యాత్రలు, పరిహారాల అందజేత, పలు రాజకీయ నేపథ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ కారణంగా సమయం లేకపోవడంతో హరీశ్ శంకర్ ను వెయింట్ లిస్ట్ లోనే ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ‘హరి హర వీర మల్లు’ చిత్రం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయమే పడేట్టుగా ఉంది. షూటింగ్ కూడా రెగ్యూలర్ గా జరుపుకోవడం లేదని తెలుస్తోంది.
 

78

చిత్రం ఆలస్యం అవుతుందనే వార్తలతో ఇప్పటికే హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్దే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్టు అనధికారికంగా సమాచారం అందుతోంది. మరోవైపు శంకర్ కూడా మూడేండ్లుగా వపన్ కళ్యాణ్ కోసం ఎదరుచూస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ మూవీ జూన్ లోనే ( ఈ నెలలో) షూటింగ్ ప్రారంభం కావాల్సింది ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది.
 

 

88

ఇంకొన్ని నెలలు తర్వాత 2023 పొలిటికల్ ఫీవర్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో పవన్ రాజకీయ కార్యక్రమాల్లో బిజీ అయ్యే అవకాశం లేకపోలేదు.  ఈ కారణంతో ఇప్పట్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ లేనట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హరీశ్ ఇంకొన్నాళ్లు వేచి ఉండక తప్పేటట్లు లేదని తేలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories