పవన్‌ ఆరు, ప్రభాస్‌ రెండు కోట్లు, చిరు, బాలయ్య, మహేష్‌, బన్నీ, ఎన్టీఆర్ ఎంత ఇచ్చారో తెలుసా?

First Published | Sep 4, 2024, 3:09 PM IST

భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజల కోసం పవన్‌, ప్రభాస్‌, చిరు, బాలయ్య, ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌ భారీగా విరాళాలు ప్రకటించారు. ఎంతించారో తెలుసా?
 

Heavy Floods Telangana

రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. భారీగా నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇళ్లు కూలిపోవడం, పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టారు. దాతలు ముందుకొచ్చి తమకు తోసిన సాయం చేస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. 

Pawan Kalyan

ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముందు వరుసలో ఉన్నారు. చాలా మంది స్టార్ హీరోలు స్పందించి భారీ స్థాయిలో విరాళం అందిస్తున్నారు. అందులో భాగంగా పవన్‌ భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి కోటీ రూపాయలు ప్రకటించిన ఆయన తెలంగాణ కోసం కోటీ రూపాయలను ప్రకటించారు. 

అంతేకాదు మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను ప్రకటించారు. ఇలా దాదాపు నాలుగు కోట్లు ఆయన ముంపు గ్రామ పంచాయతీలకు పంపిస్తానని ఆయన వెల్లడించారు.  మొత్తంగా పవన్‌ ఆరు కోట్లు విరాళంగా ఇవ్వబోతుండటం విశేషం
 


డార్లింగ్ ప్రభాస్‌ స్పందించారు. ఆయన కూడా రెండు కోట్లు విరాళం ప్రకటించారు. తెలంగాణకి కోటీ, ఆంధ్ర ప్రదేశ్‌కి కోటీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందించబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. సాధారణంగా ప్రభాస్‌ హ్యాండ్‌ చాలా పెద్దది అంటారు. ఆయనే ఎప్పుడైనా భారీగా విరాళం అందిస్తుంటారు. ఈ సారి కూడా ఆయనదే పై చేయి కావడం విశేషం. 
 

మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి కూడా కోటీ రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణకి యాభై లక్షలు, ఏపీకి యాభై లక్షలు విరాళం అందిస్తున్నట్టు వెల్లడించారు. `తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం.

 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు చిరంజీవి.
 

తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా విరాళం ప్రకటించారు. ఆయన కూడా కోటీ రూపాయలు విరాళం అందిస్తున్నట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్టాలకు చెరో యాభై లక్షల విరాళాన్ని బన్నీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ విపత్కర పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు. 

అలాగే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సైతం కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. తెలంగాణకి యాభై లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కి యాభై లక్షలు అందిస్తున్నట్టు వెల్లడించారు. 
 

ఇప్పటికే బాలకృష్ణ కోటీ రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీకి చెరో యాభై లక్షలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్‌ సైతం కోటీ రూపాయలు విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. తారక్ కి లోకేష్‌, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ధన్యవాదాలు తెలిపాయి. 

వీరితోపాటు త్రివిక్రమ్‌, హారికా అండ్‌ హాసిని నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ, నాగవంశీలు కలిసి యాభై లక్షలు(చెరో 25లక్షలు) విరాళం ప్రకటించారు. `కల్కి 2898 ఏడీ` నిర్మాత ఏపీకి రూ.25లక్షలు విరాళం అందించారు.

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ రూ.30లక్షలు(చెరో రూ15లక్షలు), విశ్వక్‌ సేన్‌ చెరో ఐదు లక్షలు, వెంకీ అట్లూరి చెరో ఐదు లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల చెరో రెండున్నర లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళం ప్రకటించారు. 
 

Latest Videos

click me!