అకిరాకి ఏమీ మిగల్చడం లేదు..ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడేస్తున్నారు, కొత్త ఆందోళన

First Published | Oct 18, 2024, 10:16 AM IST

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అఖిల్ కి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అఖిల్ కి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకిరా బాగా పొడవుగా, హ్యాండ్సమ్ లుక్ తో అందరిని ఆకర్షిస్తున్నాడు. ఆల్రెడీ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలిచేస్తున్నారు. 

అయితే అకిరా విషయంలో పవన్ ఫ్యాన్స్ లో కొత్త ఆందోళన మొదలయింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు కనీసం 30 చిత్రాల్లో కూడా నటించలేదు. వాటిలో హిట్స్ కొన్ని మాత్రమే. తొలిప్రేమ, బద్రి, ఖుషి, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇలా కొన్ని హిట్స్ ఉన్నాయి. అకిరా హీరో అయ్యాక తన తండ్రి  టైటిల్స్ తో ఏదో ఒక మూవీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాంచరణ్ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అలా సీక్వెల్ కాకపోయినా పవన్ సినిమా టైటిల్ తో అకిరా నటిస్తే ఆ కిక్కు వేరు. 


కానీ అది జరిగేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ హిట్ చిత్రాల టైటిల్స్ ని ఇప్పటి యువ హీరోలు ఏరుకుంటున్నారు. వరుణ్ తేజ్ ఆల్రెడీ తొలిప్రేమ టైటిల్ తో సినిమా చేసి హిట్ కొట్టాడు. విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం చేశాడు. నితిన్ తమ్ముడు టైటిల్ తో రాబోతున్నాడు. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కూడా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి టైటిల్ తో తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. 

ఇలా ఒక్కో హీరో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల టైటిల్స్ తీసుకుపోతుంటే అకిరాకి ఏం మిగులుతుంది అనేది ఫ్యాన్స్ ఆందోళన. మిగిలిన చిత్రాల్లో కూడా సుస్వాగతం, జల్సా టైటిల్స్ ని వేరే నిర్మాతలు రిజిస్టర్ చేసేశారట. దీనితో పవన్ ఫ్యాన్స్ అకిరాకి ఇంకేం మిగిలింది అని వాపోతున్నారు. 

పాత చిత్రాల టైటిల్స్ వాడే ట్రెండ్ చాలా కాలం నుంచి ఉంది. చిరంజీవి చిత్రాల్లో కూడా గ్యాంగ్ లీడర్, మాస్టర్, ఖైదీ, దొంగ, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి టైటిల్స్ వాడేశారు. ఎదురులేని మనిషి,  అడవిరాముడు లాంటి పాత చిత్రాల టైటిల్స్ రిపీట్ అయినవే. 

Latest Videos

click me!