ఇండియాలోనే అత్యంత లగ్జరీ కారుని బుక్‌ చేసిన పవన్‌.. ఖరీదు తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌ ?

First Published | Jul 2, 2021, 5:50 PM IST

పవన్‌ స్టార్‌ గత ఎన్నికలకు ముందు తన వద్ద ఉన్న లగ్జరీ కార్లని అమ్మేసినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటిని తిరిగి పొందుతున్నాడు. రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్న ఆయన తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్‌ రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ3.0 మోడల్‌ కారును పవన్ బుక్‌ చేసినట్టు తెలుస్తుంది. రేంజ్‌ రోవర్‌ ఆటో బయోగ్రఫీ మోడల్‌ని పవన్‌ బుక్‌ చేశారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే దీని విలువే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీని ఖరీదు రూ. నాలుగు నుంచి రూ.4.5 కోట్లు ఉంటుందట. అంతేకాదు అత్యంత లగ్జరీ కార్లలో ఇదొకటని తెలుస్తుంది. రోల్స్ రాయ్స్ కారు రేంజ్‌ అని టాక్‌.

అత్యంత కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ లగ్జరీ కారుని వాడతారు. అలాంటి లగ్జరీ కారుని పవన్‌ సొంతం చేసుకోబోతున్నారని వార్త ఇంటర్నెంట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఆయన సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంతటి లగ్జరీ కారుని కొనుగోలు చేయబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని రకాలుగా తనకిది సౌకర్యవంతంగా ఉంటుందని భావించి పవన్‌ ఈ లగ్జరీ కారుని కొంటున్నట్టు సమాచారం.
పవన్‌ రీఎంట్రీ తర్వాత జోరు పెంచారు. `వకీల్‌సాబ్‌`తో అదిరిపోయే హిట్‌ని అందుకున్నారు. అంతేకాదు పారితోషికం పరంగానూ షాక్‌ ఇస్తున్నారు. `వకీల్‌సాబ్‌`కి ఆయన రూ.50కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు. ప్రస్తుతం కమిట్‌ అయిన చిత్రాలకు కూడా 50-60 మధ్యలో పారితోషికం అందుకుంటున్నారట.
పవన్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయిక దీంతోపాటు సాగర్‌ కె చంద్ర డైరెక్షన్‌లో `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో రానా మరో హీరో. ఐశ్వర్యా రాజేష్‌, నిత్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారట. శరవేగంగా ఈ చిత్రాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. త్వరలో హరీష్‌ శంకర్‌తో సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారు పవన్‌.

Latest Videos

click me!