రేటు భారీగా పెంచేసిన పవిత్ర లోకేష్, ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

Published : Aug 02, 2022, 09:45 PM IST

పవిత్రా లోకేష్  ఈ మధ్య టాలీవుడ్ లో సెన్సేషన్ అయిన పేరు. ఆవిడ స్టార్ హీరోయిన్ కాదు... అయినా సరే టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసింది. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేశ్ తో ప్రేమ, పెళ్ళి,సహజీవనం, స్నేహం ఇలా రకరకాల వివాదాలతో ఆమె వార్తల్లో నిలిచిన పవిత్ర లోకేష్.. రీసెంట్ గా రేటును భారీగా పెంచేసిందట. 

PREV
17
రేటు భారీగా పెంచేసిన పవిత్ర లోకేష్,  ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు పవిత్ర లోకేష్. సరిగ్గా అదే టైమ్ లోనరేష్ తో రిలేషన్ షిప్ మ్యాటర్ తో ఒక్క సారిగా సెన్సేషన్ అయ్యారు ఆమె.  సోషల్ మీడియాలో కూడా పవిత్రా లోకేశ్ పేరు మారు మోగి పోయింది. ఇదివరకు కొంత మందికే తెలిసిన ఈ నటి.. ఈ వివాదంతో అందరికి నోటెడ్ అయిపోయింది. 

27

అంతే కాదు ఆ మధ్య మైసూర్ లోని ఓ  హోటల్ రుమ్ లో నరేష్ తో కలిసి..  పవిత్ర లోకేశ్ కలిసి కనిపించడంతో  ఆమె ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయింది. అయితే వివాదం వల్ల టాలీవుడ్ లో ఆమె ఆఫర్లు నిలిచిపోతాయి అనుకున్నారంతా.. కాని పవిత్రా లోకేశ్ డిమాండ్  రోజురోజుకు పెరుగుతుందే తప్ప.. తగ్గడంలేదు. అంతే కాదు ఆమె ఈ మధ్య తన రేటు కూడా భారీగా పెంచిందట. 
 

37

రీసెంట్ గా రవితేజ  రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవిత్రా లోకేశ్  కీలక పాత్రలోకనిపించారు. అయితే ఈ సినిమాకు ఆమె రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు పవిత్రా లోకేశ్ ఒక్కరోజుకి  60 వేల రెమ్యూనరేషన్ తీసుకునేవారట.  ఇక ప్రస్తుతం అది కాస్తా రోజుకు లక్ష రూపాయలకు పెంచినట్టు తెలుస్తోంది. 

47

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన  పవిత్రా లోకేశ్,టాలీవుడ్ లో  తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. మొదట్టలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె.. ఇప్పుడు డిమాండ్ పెరిగే సరికి రేటు కూడా పెంచేసిందట.  పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరగడానికి అటే  నరేష్ కూడా గట్టిగానే హెల్ప్ చేస్తున్నట్టు  ఫిల్మ్ సర్కిల్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. 
 

57

టాలీవుడ లో మరో వెర్షన్ ఏమి వినిపిస్తుందటే.. పవిత్ర లోకేష్ - నరేష్ వివాదం తరువాత ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి.. ఉన్న సినిమాలు కూడా చేజారి పోతున్నాయి... అని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

67

తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రలలో పవిత్రా లోకేశ్ ఇమిడిపోయేవారు. యంగ్ హీరోలతో పాటు  సీనియర్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి  కూడా పవిత్రా లోకేశ్ సై అంటున్నట్టు తెలుస్తోంది. .దాంతో ఎక్కువగా ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయట.  
 

77

అసలే వివాదాల్లో మునిగి ఉన్న పవిత్ర లోకేష్ .. ఈ టైమ్ లో రెమ్యునరేషన్  పెంచడం కరెక్టేనా.. దీనివల్ల  పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయా.. లేదా తగ్గుతాయా..? ఏం జరుగుతుందో చూడాలి. అంతే కాదు నరేష- పవిత్ర లోకేష్ వివాదం కూడా ఎక్కడివరకూ వెళ్తుంతో చూడాలి. 

click me!

Recommended Stories