2023లో పాన్ ఇండియా దండయాత్ర.. ప్రభాస్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ రెడీ.. తగ్గేదే లే అంటున్న 'హను మాన్ ' 

Published : Dec 19, 2022, 12:11 PM ISTUpdated : Dec 19, 2022, 12:28 PM IST

ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం ఫిలిం మేకర్స్ పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో పదుల సంఖ్యలో పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి.

PREV
111
2023లో పాన్ ఇండియా దండయాత్ర.. ప్రభాస్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ రెడీ.. తగ్గేదే లే అంటున్న 'హను మాన్ ' 

ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం ఫిలిం మేకర్స్ పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో పదుల సంఖ్యలో పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. బిగ్ స్టార్స్ ని చూసి మీడియం రేంజ్ హీరోలు కూడా తమ చిత్రాల్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలు ఇతర భాషల్లో కూడా వర్కౌత్ అవుతున్నాయి. చిన్న చిత్రంగా వచ్చిన కాంతారా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2023లో టాలీవుడ్ నుంచి కొన్ని క్రేజీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

211

RC 15: ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రాంచరణ్ సివిల్ సర్వీస్ అధికారిగా నటిస్తున్నాడు. రాంచరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రం ఉండబోతున్నాయి. 2023లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రంతో ఫ్యాన్స్ కి పండగే. 

311

ఎన్టీఆర్ 30: ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న చిత్రం ఇది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చిత్రం అంటే తప్పకుండా పాన్ ఇండియా అంచనాలు ఉంటాయి. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టి 2023లోనే ఈ చిత్రం రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

411

సలార్: బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ సక్సెస్ ఇంకా దక్కలేదు. దీనితో ప్రభాస్ అభిమానులంతా ప్రశాంత్ నీల్ నే నమ్ముకుని ఉన్నారు. కెజిఎఫ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం యాక్షన్ అంశాలతో అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది. 2023 సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

511

పుష్ప -2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బన్నీ యాటిట్యూడ్, డ్యాన్స్, సుకుమార్ టేకింగ్ కి అంతా ఫిదా అయ్యారు. బన్నీ మ్యానరిజమ్స్, డైలాగ్స్ అయితే ఇంటర్నేషనల్ లెవల్ కి కూడా వెళ్లాయి. దీనికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప 2చిత్రాన్ని 2023లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

611

హను-మాన్ : పిట్టకొంచెం కూత ఘనం అనే సామెత.. యంగ్ హీరో తేజ సజ్జాకి బాగా సరిపోతుంది. ప్రస్తుతం తేజ సజ్జా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో మూవీ హను -మాన్ లో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వందలకోట్లు పెట్టినా సాధ్యం కానీ అబ్బురపరిచే విజువల్స్ టీజర్ లో ప్రశాంత్ వర్మ చూపించారు. 2023 రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

711

ధమ్కీ: హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న ధమ్కీ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. తన మాస్ యాటిట్యూడ్ తో పాన్ ఇండియా ని చుట్టేయాలని విశ్వక్ సేన్ భావిస్తున్నాడు. 

 

811

ఆదిపురుష్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ఇది పాన్ ఇండియా మూవీ మాత్రమే కాదు.. పౌరాణిక చిత్రం కూడా. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. అయితే ఆ మధ్యన విడుదలైన టీజర్ తో ఈ చిత్రంపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. నెగిటివిటీ ఏర్పడింది. దీనితో సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ కి వాయిదా పడింది. 

911

దసరా: నేచురల్ స్టార్ నాని ఊర మాస్ లుక్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ లో నాని మేకోవర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం కూడా సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. 

 

1011

ఏజెంట్: అక్కినేని వారసుడు అఖిల్ కి ఇంకా నిఖార్సైన కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. మాస్ హీరో అనిపించుకునేందుకు అఖిల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి అఖిల్ ఏజెంట్ చిత్రంతో పకడ్బందీగా రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

1111

హరిహర వీరమల్లు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిసారి భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories