తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగింది సమంత. 14 ఏళ్ళ క్రితం తమిళ సినిమాతో తేరంగేట్రం చేసిన ఆమె.. ఆతరువాత తెలుగులో కూడా అవకాశాలు సాధించింది. ఏమాయచేశావు సినిమాతో నిజంగా మాయ చేసిన.. ఈ నటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గామారిపోయింది.
చాలా తక్కువ కాలంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. తమిళంలో విజయ్, సూర్య, ధనుష్, విశాల్ లాంటి స్టార్స్ తో సందడి చేసింది. హీరోలను మించిన ఫాలోయింగ్ తో పాటు.. సోషల్ మీడియాలో తిరుగులేని ఇమేజ్ ను సంపాధించుకుంది బ్యూటీ.
ఇదిలా ఉంటే, ప్రింట్ ఒరిజినల్ సమంతాగా ఉన్న ఓ మహిళ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఏమాత్రం తేడా లేకుండా సమంత ఫీచర్స్ ను ముఖంపై కలిగిని ఈ లేడీ.. పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్ళి కూతురు గెటప్ లో ఉన్న ఈ అమ్మాయి సమంత పెళ్లిలో ఎలా ఉందో అలాగే చీర కట్టుకుని మేకప్ వేసుకుంది.
ప్రస్తుతం ఆఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసి చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సమంత ఈమె కవల పిల్లలేమో అని కొందరు.. ఇది నిజంగా విచిత్రమే అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.
కాగా... ప్రస్తుతం నటనకుకాస్త విరామం ఇచ్చింది సమంత. సినిమాలు చేస్తున్నటైమ్ లోనే.. తన సహనటుడు నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించిన సమంత 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే, సమంత మరియు నాగ చైతన్య ఇద్దరూ 2021లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సమంత పలు విమర్శలు కూడా ఎదుర్కొంది.
అంతే కాదు విడాకుల తర్వాత సమంత 2వ పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సమంత ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అటునాగచైతన్య గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయనకు నాగార్జున రెండో పెళ్లి చేయబోతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడింది. ఈ వ్యాధికి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఏడాదిపాటు నటనకు విరామం ప్రకటించి విదేశాలు తిరుగుతూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది సమంత. ప్రస్తుతం సమంత చేతిలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ సిరీస్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.