చార్మినార్ లో షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య.. ఆమె సింప్లిసిటీపై ఫ్యాన్స్ పొగడ్తలు..

First Published | Apr 17, 2023, 6:19 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) భార్య తాజాగా చార్మినార్ లో సందడి చేశారు. షాపింగ్ కోసం వచ్చిన  తారక్ సతీమణి తన సింప్లిసిటీతో ఆకట్టకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -  లక్ష్మి ప్రణతి (Lakshmi Pranathi) ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా ముద్రవేసుకున్నారు. ఒకరిపై ఒకరు చూపించే ప్రేమకు ఇటు తారక్ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తుంటారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ప్రణతి సందడి చేస్తూ ఉంటారు. 
 

అయితే తాజాగా లక్ష్మి ప్రణతికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోను చూసిన ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేస్తూ వస్తున్నారు. ‘వదినమ్మ’ అంటూ క్యాప్షన్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. అలా కనిపించడంతో సంతోషిస్తున్నారు. 
 


ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..  తాజాగా లక్ష్మి ప్రణతి చార్మినార్ నైట్ బజార్ ను సందర్శించారు. ఈ సందర్భంగా షాపింగ్ కూడా చేశారు. ప్రణతి ఒక్కరే చాలా సింపుల్ గా వచ్చి షాపింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఫొటోలు చేసి నెట్టింట షేర్ చేశారు. 

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కు భార్య అయినప్పటికీ లక్ష్మి ప్రణతి చాలా సింపుల్ గా జనాల మధ్య షాపింగ్ చేయడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా ఈవెంట్లలో, ఫంక్షన్లలోనూ పెద్దగా కనిపించని ప్రణీత ఇలా దర్శనవివ్వడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డుల వేడుకలోనూ ఎన్టీఆర్ తో కలిసి ప్రణతి సందడి చేసిన విషయం తెలిసిందే. ట్రెండీ అవుట్ ఫిట్స్, స్టైలిష్ వేర్స్ లో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, ప్రణతికి సంబంధించిన ఆఫొటోలను ఇప్పటికీ నెట్టింట ఫ్యాన్స్ వైరల్ చేస్తూనే ఉన్నారు. 
 

ఇక ఎన్టీఆర్ - ప్రణతిల వివాహం 2011లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో వీరిది కూడా ఒకటి. ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడుపుతుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Latest Videos

click me!