కట్టిపడేసే అందం, కవ్వించే పోజులతో మతిపోగొడుతున్న ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ప్రణీత ముద్దులకి పెట్‌ డాగ్‌ పులకరింత

First Published | Nov 30, 2022, 1:59 PM IST

ప్రణిత సుభాష్‌ క్యూట్‌ అందాలతో టాలీవుడ్‌ ఆడియెన్స్ ఆకట్టుకుంది. పవన్‌ హీరోయిన్‌గా మెప్పించింది. ఇప్పుడు మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లోసెటిల్‌ అయిన ఈ భామ గ్లామర్‌ ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తుంది. 

ప్రణీత(Pranitha Subhash).. తాజాగా క్యూట్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ ఎంతో క్యూట్‌ పోజులతో ఆకట్టుకుంటుంది. తన పెట్‌ డాగ్‌తో కలిసి ఫోటోలు దిగింది. చిలిపి పోజులిస్తూ వాహ్‌ అనిపించింది. ఈ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో ప్రణీత తన డాగ్‌కి ముద్దులు పెట్టడం హైలైట్‌గా నిలిచింది. 
 

ఓ వైపు క్యూట్‌ అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ముద్దులన్నీ తన డాగ్‌కే పెడుతుండటంతో కుర్రాళ్లంతా గోల చేస్తున్నారు. అదృష్టం అంటే ఆ డాగ్‌దే మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.
 


ప్రణీత ప్రస్తుతం మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. అదే సమయంలో తనొక పాపకి కూడా జన్మనిచ్చింది. ఫ్యామిలీ లైఫ్‌ని, మాతృత్వంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తుంది. తరచూ తన చిన్నారితో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ప్రణీతి. 

మరోవైపు గ్లామర్‌ ఫోటో షూట్లు కూడా చేస్తుంది. మ్యారేజ్‌ అయి, ఓ పాపకి జన్మనిచ్చిన కొన్ని రోజులకు మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంది ప్రణీత. దీంతో గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే తల్లిగా మారిన తర్వాత ఆమె అందం మరింత రెట్టింపు కావడం విశేషం. 
 

ఇటీవల ఆమె పంచుకుంటున్న ఫోటో షూట్‌ పిక్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాదు హాట్ గానూ ఉన్నాయి. హాట్‌ డోస్‌ పెంచుతూ ఆమె ఫోటోలకు పోజులిస్తుంది. ఆ పిక్స్ ని అభిమానులతో పంచుకంటూ వారిని ఖుషీ చేస్తుంది. నిత్యం వారిని ఎంగేజ్‌ చేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

ప్రణీత సుభాష్‌ గతేడాది బెంగుళూరుకి చెందిన బిజినెస్‌ మ్యాన్‌ నితిన్‌ రాజుని సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆమె వివాహం జరిగింది. మ్యారేజ్‌ అయ్యాక అభిమానులతో ఆ విషయాన్ని పంచుకుంది ప్రణీత. గతేడాది మే 30న ఆమె వివాహం జరిగింది. జూన్‌ 10న ఆమె కూతురుకి జన్మనిచ్చింది. చిన్నారికి అర్నా అనే పేరు పెట్టారు. 

ఇక కన్నడకి చెందిన ఈ క్యూట్‌ అందాల భామ `ఏం పిల్లో ఏం పిల్లడో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్‌తో `బావ` చిత్రంలో నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా మెప్పించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ చిత్రాలు చేసిన ఆమె తెలుగులో చేసింది చాలా తక్కువే. 
 

పవన్‌ కళ్యాణ్‌తో `అత్తారింటికి దారేదీ`లో మెరిసింది. సమంత తర్వాత సెకండ్‌ లీడ్‌గా ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌తో `రభస`, మంచు విష్ణుతో `డైనమైట్‌`, మహేష్‌ `బ్రహ్మోత్సవం`, `హలో గురు ప్రేమ కోసమే`, `ఎన్టీఆర్‌ కథానాయకుడు` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడనాటు `రమణ అవతార` చిత్రంలో నటిస్తుంది.

Latest Videos

click me!