తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నిత్యా మీనన్ ఇటీవల సరైనా అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. ఓ వైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ అమ్మడికి పెద్ద ప్రాజెక్ట్ లు దక్కడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా మత్తెక్కించే ఫోటోలు పంచుకుని వాహ్ అనిపించింది. బెడ్‌పై పడుకొని హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో చూపుతిప్పుకోనివ్వడం లేదు.
బెడ్‌పై నిత్యా ఇలా సెక్సీ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆగలేకపోతున్నారు. నిత్యా లోని కొత్త యాంగిల్‌కి ఫిదా అవుతున్నారు.
మరి నిత్యా ఇంతగా అందాల ఆరబోతకి కారణం సరైన సినిమా ఛాన్స్ లు లేకపోవడమేనా? అనే అనుమానాలకు తావిస్తున్నాయి. మరి అవకాశాల కోసమే నిత్యా ఇలా ఆరబోతకి తెగించిందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
`అలా మొదలైంది` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు బ్యూటీ మాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది.
తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. బబ్లీ లుక్‌లో, వెరైటీ వాయిస్ టోన్‌తో అలరించింది, అభిమానగణాన్ని ఏర్పర్చుకుంది.
`ఇష్క్` చిత్రంతో కమర్షిల్ హిట్‌ని అందుకుని క్రేజీ బ్యూటీగా ఎదిగింది నిత్యా మీనన్. ఈ సినిమాలో నిత్యా నటన మెస్మరైజ్ చేస్తుంది. ఇక క్యూట్ అందాలతో మతిపోయేలా చేసింది.
`జబర్దస్త్`, `ఒక్కడినే`, `గుండెజారి గల్లంతయ్యిందే` చిత్రాల్లో మెరిసి `గుండెజారి గల్లంతయ్యిందే`తో మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది.
`మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` సినిమా నిత్యా కెరీర్‌ని పీక్‌లోకి తీసుకెళ్లిపోయిందని చెప్పొచ్చు. ఇందులో శర్వానంద్‌తో కలిసి అద్భుత నటన ప్రదర్శించింది. ఆడియెన్స్ మెస్మరైజ్ చేసింది. లవ్ స్టోరీకి కొత్త అర్థాన్నిచ్చింది. ఘాటు ప్రేమని తెలియజేసింది.
`సన్నాఫ్ సత్యమూర్తి`, `ఒక్క అమ్మాయి తప్ప`, `రుద్రమదేవి`, `జనతా గ్యారేజ్`, `ఆ`, `గీతగోవిందం`(గెస్ట్ రోల్), `ఎన్టీఆర్` బయోపిక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
హిందీలోకి ఎంట్రీ ఇచ్చి నటించిన `మిషన్ మంగళ్`తో బంపర్ హిట్‌ని అందుకుంది. కానీ హిందీలో అవకాశాలు రావడం లేదు. అందుకోసమే ఇలా గ్లామర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనే డౌట్ వస్తుంది. సాంప్రదాయంగా, పద్ధతిగా కనిపించే నిత్యా కూడా గ్లామర్ షోకి ఓకే చెప్పినట్టుగానే ఉన్నాయి తాజా ఆమె ఫోటోలు.
ప్రస్తుతం నిత్యా తెలుగులో `గమనం`, `నిన్నిలా నిన్నిలా`, మలయాళంలో `కోలాంబి`, `ఆరం థిరుకాల్పనా`, `19(1)` చిత్రాల్లో నటిస్తుంది.