రోజుకో తీరుగా అందాల దర్శనం చేస్తున్న గ్లామరస్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) తాజాగా తన బర్త్ డే సందర్భంగా మరింత ఘాటుగా మెరిసింది. ఏకంగా బీచ్ లో తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
తాజాగా ఓ బీచ్ లో నేహా శర్శ సందడి చేసింది. పుట్టిన రోజు వేడుకలను అక్కడే జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ కొన్ని గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుని ఐఫీస్ట్ అందించింది. బీచ్ వేర్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ రచ్చ చేసింది.
బ్లాక్ లాంగ్ బీచ్ వేర్ లో నేహా శర్మ అందాల విందు చేసింది. ఓవైపు థైస్ షో, మరోవైపు క్లీవేజ్ షోతో నార్త్ బ్యూటీ రచ్చరంభోలా చేసింది. సొగసుల ప్రదర్శనతో పాటు మత్తెక్కించే స్టిల్స్ తో ఆకట్టుకుంది. నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది.
నేహా శర్మ నుంచి ఇలా గ్లామర్ ట్రీట్ నార్మల్ అనే చెప్పాలి. ఏదేమైనా ఈరోజు నేహా శర్మ పుట్టిన రోజు కావడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరింతగా కెరీర్ లో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాలని చేరుకోవాలని కోరుకుంటున్నారు.
ఇక నేహా శర్మ 1987 నవంబర్ 21న జన్మించింది. నేటితో ఈ ముద్దుగుమ్మ 36వ ఏట అడుపెట్టింది. ఇప్పటికీ బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. కెరీర్ లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. నార్త్ లోనే సినిమాలు చేస్తూ వస్తోంది. మళ్లీ సౌత్ లో అడుగుపెట్టేదెప్పుడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నేహా శర్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- నేహా కాంబోలో వచ్చిన ‘చిరుత’తో మంచి విషయం అందుకుంది. ఆ తర్వాత సినిమాలున్నా ఫలితాలు అనుకూలంగా లేవు. చివరిగా నవాజుద్దీన్ సుద్ధిఖీ సరసన ‘జోగిరా సారా రారా’ చిత్రంతో అలరించింది.