షాకింగ్.. అవమానంతో స్టార్ హీరోపై రగిలిపోతున్న నయన్, ఇద్దరికీ చెడినట్లే .. భర్త విగ్నేష్ వల్ల గొడవ ?

Published : Feb 11, 2023, 10:53 AM IST

నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ విషయంలో ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. తమిళ అగ్ర హీరోతో నయనతారకి చెడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

PREV
16
షాకింగ్.. అవమానంతో స్టార్ హీరోపై రగిలిపోతున్న నయన్, ఇద్దరికీ చెడినట్లే .. భర్త విగ్నేష్ వల్ల గొడవ ?

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార సరోగసి ఎంచుకోవడం పై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాంట్రవర్సీని నయన్ దంపతులు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుని బయట పడ్డారు. 

26

తాజాగా నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ విషయంలో ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. తమిళ అగ్ర హీరోతో నయనతారకి చెడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ కి దర్శకుడు పర్వాలేదనిపించే చిత్రాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఎక్కువగా లేవు. దీనితో విగ్నేష్ చాలా కాలంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేయాల సిద్ధం చేసుకున్నారు. 

36

తమిళ స్టార్ హీరో అజిత్ పేరు చెబితే ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటి అజిత్ కి స్టోరీ లైన్ చెప్పి ఒప్పించాడు విగ్నేష్. దీనితో వీరిద్దరి కాంబినేషన్ కి అంతా సిద్ధం అయింది. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కానీ చివర్లో విగ్నేష్ కి ఊహించని షాక్ తగిలింది. కథ నచ్చలేదని అజిత్, లైకా నిర్మాతలు విగ్నేష్ ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారు. నయన్ భర్తకి ఇది ఘోర అవమానమే అని చెప్పాలి. 

46

విగ్నేష్ చాలా కాలంగా ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. కానీ చివరి దశలో అజిత్ రిజెక్ట్ చేయడంతో విగ్నేష్ జీర్ణించుకోలేకపోయాడట. పెళ్లి తర్వాత విగ్నేష్ చేస్తున్న భారీ చిత్రం కావడంతో నయనతారకి కూడా అవమానంగా అనిపించింది అని తమిళ వర్గాలు చెబుతున్నాయి. దీనితో సమస్యని పరిష్కరించేందుకు స్వయంగా నయన్ రంగంలోకి దిగింది అట. 

56

నయనతార, అజిత్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ బిల్లా, ఆరంభం, విశ్వాసం లాంటి సూపర్ హిట్స్ లో నటించారు. అజిత్ తన మాట వింటాడు అనే నమ్మకంతో నయనతార సమస్య పరిష్కారానికి ప్రయత్నించింది. కానీ నయన్ కు కూడా భంగపాటు తప్పలేదు. దీనితో నయనతార ఇది తనకి జరిగిన అవమానం గానే ఫీల్ అయ్యిందట. 

66

ఇకపై ఎట్టి పరిస్థితుల్లో అజిత్ తో కలసి నటించకూడదు అని శపథం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో అజిత్, నయనతార మధ్య గ్యాప్ వచ్చినట్లే అని తమిళ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం విగ్నేష్ వల్ల జరగడంతో నయన్ అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు.  

 

click me!

Recommended Stories