పవన్‌ స్కెచ్‌కి అన్నకు జాక్‌ పాట్‌ ?.. అప్పుడు చిరు.. ఇప్పుడు నాగబాబు

First Published | Jan 9, 2021, 2:28 PM IST

నాగబాబు త్వరలోనే ఎంపీ కాబోతున్నాడా? త్వరలోనే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.  మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నాగబాబు ఎంపీ
ఎలా కాబోతున్నాడు? ఆయనకు మంత్రి పదవి ఎలా రాబోతుంది. జనసేన నాయకుడిగా ఉన్న నాగబాబుకి కేంద్ర మంత్రి పదవి ఎలా సాధ్యమవుతుంది?..
 

అన్న చిరంజీవి `ప్రజారాజ్యం` పార్టీ స్థాపించి కేవలం రెండు పదుల అంకెకే పరిమితమయ్యారు. అధికారం దక్కలేదు. కొన్నాళ్లకి ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి కేంద్ర మంత్రి పదవి కొట్టేశాడు. పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు.
అలాగే పవన్‌ కళ్యాణ్‌ గత ఎన్నికల సమయంలో `జనసేన` పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికారు. కానీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. పవన్‌ కళ్యాణ్‌తోపాటు, నాగబాబు సైతం నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

నాగబాబు తమ్ముడు పవన్‌ వెంట ఉండి పోరాడారు. ప్రచారం నిర్వహించడం, తమ్ముడికి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. పవన్‌ పై ఎవరైనా విమర్శలు చేసినా నాగబాబు స్పందించి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ వస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పవన్‌ బీజేపీకి మద్దతు పలికారు. మొన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకే సపోర్ట్ చేశారు. దీంతో గ్రేటర్‌లో భారీగా బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా జనసేన.. బీజేపీకి మద్దతు పలికింది.
ఇదిలా ఉంటే ఈ ఒప్పందం వెనకాల పవన్‌ భారీ స్కెచ్‌ వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే అన్నయ్య నాగబాబుని కేంద్ర మంత్రిని చేయబోతున్నారు. బీజేపీకి మద్దతు వెనకాల అసలు కారణమిదే అని తెలుస్తుంది. త్వరలోనే కొన్ని రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతుంది. అందులో నాగబాబుకి రాజ్యసభ ఎంపీని చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధంగా ఉందట. ఎంపీని చేసి నాగబాబుకి ఓ కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ప్రిపరేషన్‌ జరుగుతుందని టాక్‌.
ఇదిలా ఉంటే తమ్ముడు పవన్‌కి వెన్నుదన్నుగా ఉన్న నాగబాబు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఆయన తన కుమార్తె నిహారిక మ్యారేజ్‌ చేశారు. పెద్ద బాధ్యత తీరిపోయింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ హీరోగా రాణిస్తున్నారు. తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు.
అందులో భాగంగానే తాను చేస్తోన్న టీవీ షోస్‌ని కూడా తగ్గించారట. `జబర్దస్త్` ద్వారా జడ్జ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్న నాగబాబు ఇటీవల `బొమ్మ అదిరింది` షోకి జడ్జ్ గా వ్యవహరించారు. ఇది బాగా ఆడింది. ఆ తర్వాత తన యూ ట్యూబ్‌ ఛానెల్‌ స్టార్‌టప్‌ కామెడీ షోలు చేశారు. `విజిల్‌` అనే షోని రన్‌ చేశారు. ఆ తర్వాత `ఖుషీ ఖుషీగా` అని మరో కామెడీ చేస్తున్నారు.
మెయిన్‌స్ట్రీమ్‌ షోన్‌ని తగ్గించుకుంటున్నారట నాగబాబు. ఇదంతా పక్కా ప్లానింగ్‌తోనే జరుగుతున్నట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలు పూర్తయ్యాక, రాజ్యసభ ఎంపీగా చేసి ఆ వెంటనే కేంద్ర మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్టు టాక్‌ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే మంత్రిగా బయటి వారికంటే సొంత అన్నయ్య ఉంటేనే కేంద్రంలో తమ పార్టీ వాయిస్‌ని బాగా వినిపించడం సాధ్యమవుతుందని పవన్‌ భావిస్తున్నారు. ఎందుకంటే నాగబాబు ముక్కుసూటి మనిషి. ఎవరైనా విమర్శిస్తే, దిమ్మితిరిగేలా కౌంటర్‌ ఇవ్వగలరు. తమ వాయిస్‌ని సొంత అన్నయ్యే మాత్రమే బాగా వినిపించగలరని పవన్‌ అనుకుంటున్నారట. మొన్న ఎన్నికల్లో గెలిచిన ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఇతర పార్టీలోకి జంప్‌ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సొంత మనిషినే నమ్ముకోవాలని పవన్‌ ఆలోచిస్తున్నట్టు టాక్‌.

Latest Videos

click me!