మళ్లీ కలవబోతున్న సమంత, నాగచైతన్య.. తెరవెనుక కథ నడిపిస్తున్న లేడీ డైరెక్టర్‌ ?.. షాకింగ్‌ డిటెయిల్స్

Published : Apr 02, 2022, 03:17 PM ISTUpdated : Apr 02, 2022, 03:54 PM IST

సమంత, నాగచైతన్యలకు సంబంధించిన ఆ షాకింగ్‌ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మళ్లీ వీరిద్దరు కలవబోతున్నారా? మరోసారి వీరిద్దరిని వెండితెరపై చూడబోతున్నామనే వార్త సంచలనంగా మారుతుంది. 

PREV
16
మళ్లీ కలవబోతున్న సమంత, నాగచైతన్య.. తెరవెనుక కథ నడిపిస్తున్న లేడీ డైరెక్టర్‌ ?.. షాకింగ్‌ డిటెయిల్స్

సమంత(Samantha), నాగచైతన్య(Naga chaitanya) `ఏం మాయ చేసావె` చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. అక్కడే వీరి ప్రేమకి బీజం పడింది. మొదట స్నేహంగా ప్రారంభమైన వీరి రిలేషన్‌ ప్రేమగా మారి 2017లో పెళ్లి వరకు వెళ్లింది. చాలా గ్రాండ్‌గా చైతూ,సామ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అటు హిందూ సాంప్రదాయల ప్రకారం, అటు క్రిస్టియన్‌ ట్రెడిషన్‌ ప్రకారం రెండుసార్లు వీరి వివాహం జరిగింది. టాలీవుడ్‌లో అత్యంత లగ్జరీ మ్యారేజ్‌గా వీరి వివాహం నిలిచింది. 

26

మరోవైపు దాదాపు నాలుగేండ్లు కలిసున్నారు చైతూ, సామ్‌. అన్యోన్య దంపతులుగా పేరుతెచ్చుకున్నారు. ఆదర్శజంటగానూ నిలిచారు. వీరిని చూసి ఎంతో మంది కుళ్లుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ వైపు ఎవరికివారు తమ సినీ జీవితాన్ని కంటిన్యూ చేస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమోకారణాలు తెలియవు గానీ వీరిద్దరు విడిపోతున్నట్టు గతేడాది అక్టోబర్‌ 2న ప్రకటించి షాకిచ్చారు. ఫ్యాన్స్ నే కాదు, యావత్‌ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకి షాకిచ్చారు. 

36

మరోవైపు చైతూ, సమంత కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించారు. `ఏం మాయ చేసావె`, `ఆటోనగర్‌ సూర్య`, `మనం`, `మజిలి` సినిమాలు చేశారు. మ్యారేజ్‌ తర్వాత `మజిలి`లో నటించారు. ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ని అందుకున్నారు. మరోవైపు `ఓ బేబీ`లో సమంత కీరోల్‌ చేయగా, నాగచైతన్య గెస్ట్ రోల్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ వీరు కలిసి నటించలేదు. కానీ తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 

46

త్వరలో నాగచైతన్య, సమంత కలవబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చైతూ, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది ఈ వార్త సారాంశం. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా, సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. సమంతతో నందిరెడ్డి `ఓ బేబీ` సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వీరిద్దరితో ఓ సినిమా చేయాలనే కమిట్‌మెంట్‌ ఉందట. దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. 

56

నాగచైతన్య, సమంత జంటగా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తుందట. దీనికి నాగచైతన్యలను, సమంతలను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. చైతూ వైపు నుంచి సానుకూల స్పందన ఉందని, సమంతని ఒప్పించే పనిలో నందినిరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌ అవడంతోపాటు హాట్‌ టాపిక్‌గానూ మారింది. ఇదే జరిగితే, ఇద్దరి అభిమానులకు పండగే అని, ఇదొక సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పొచ్చు. 

66

ఇక ఇప్పుడు సమంత అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తుంది. `శాకుంతలం` చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. అలాగే తమిళంలో చేసిన `కాతు వాకుల రెండు కాదల్‌` సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరోవైపు డ్రీమ్‌ వారియర్స్ ప్రొడక్షన్‌లో ఓ సినిమా, దీంతోపాటు ఓ అంతర్జాతీయ చిత్రం, అలాగే విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయబోతుందట. మరోవైపు నాగచైతన్య `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నారు. అలాగే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. ఆయన చేతిలోని ఒకటిరెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories