అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఎవరికివారు డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ముఖ్యంగా సినిమాల విషయంలో ఎవరి విజన్ వారిది. ఎవరి ఆలోచనలు వారివి. నాగార్జున ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ.. ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు చేస్తున్నారు. ఆయన కొడుకులు చైతన్య-అఖిల్ కూడా ఎవరికి వారు డిపెరెంట్ గా ఆలోచిస్తూ.. సినిమాలు చేస్తున్నారు.
ఇక నాగచైతన్య తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను సెలక్ట్ చేసుకుంటూ.. ముందుకు వెళుతున్నాడు. మరో వైపున అఖిల్ కూడా తనకి నచ్చిన పాత్రల కోసం కష్టపడుతూ.. సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇద్దరూ తమకు నచ్చిన దారిలో వారు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావడంలో చైతూ కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. కానీ అఖిల్ అసలు ఆ వైపు వెళ్లే ప్రయత్నమే చేయలేదు. అన్నిలవ్ స్టోరీస్.. లేదా యాక్షన్ మూవీస్.
అయితే గతంలో అక్కినేని మూడు జనరేషన్ల హీరోలు అంతా కలిసి మనం సినిమాలో నటించి.. ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇచ్చారు. అంతే కాదు పెద్దాయన ఏఎన్నార్ కు కూడా ఇది మెమరబుల్. ఇదే ఆయకు చివరి సినిమా కూడా. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో భారీ మల్టీ స్టారర్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫ్యామిలీ సబ్జెక్ట్ టచ్ చేయని అఖిల్ కోసం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ను రెడీ చేసుకుని వచ్చి.. నాగార్జునకి వినిపించాడట.
అయితే ఆ కథలో కొత్త పాయింట్ ఉండటం. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడమెలాగో శ్రీకాంత్ అడ్డాలకి తెలిసి ఉండటంతో... నాగార్జున కూడా ఈ సినిమాకు సరే అన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ కథపై నాగ్ ప్రత్యేకమైన శ్రద్ధనే పెట్టారని అంటున్నారు. ఈ కథలో అఖిల్ తో పాటు చైతూ కూడా చేసే అవకాశం ఉండేలా మార్పులు చేసి .. మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా మార్చమని శ్రీకాంత్ అడ్డాలకు నాగార్జున చెప్పారట.
ఇప్పటికే నాగచైతన్యతో కలిసి నాగార్జున మల్టీ స్టారర్ మూవీగా బంగార్రాజు చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అఖిల్ తో కూడా ఓ మల్టీ స్టారర్ అనుకున్నారు. కాని ఆ సినిమా వర్కైట్ కాలేదు. ఎప్పుడో అఖిల్ ఊహతెలియని రోజుల్లో సిసింద్రీ సినిమా చేశారు నాగార్జున-అఖిల్. అయితే అంతా నాగార్జున, అఖిల్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనుకుంటే.. ప్లాన్ చేంజ్ చేసి.. తన కొడుకులిద్దరితో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారు నాగ్.
ఇక శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలసమాచారం. అంతే కాదు అన్నపూర్ణ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీకాంత్ అడ్డాల గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బాగా పాపులర్ అయ్యారు. ఈసినిమాను మహేష్-వెంకీతో కలసి మల్టీ స్టారర్ ఫ్యామిలీ మూవీగా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆతరువాత వరుసగా ప్లాప్ లు ఫేస్ చేశాడు అడ్డాల. రీసెంట్ గా నారప్ప సినిమాతో మళ్ళీ కాస్త ఫామ్ లోకి వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.