అరటి తోటలో పట్టు చీర కట్టిన పడుచుపిల్ల.. నభా నటేష్‌ కవ్వింపు చర్యలు చూస్తే కుర్రకారుకి మెంటలే!

First Published | Nov 11, 2023, 5:04 PM IST

`ఇస్మార్ట్ శంకర్‌` భామ నభా నటేష్‌ సినిమాలు లేక గ్లామర్‌ ఫోటోలతో సరిపెడుతుంది. ప్రస్తుతం ఈబ్యూటీ చేసిన ఫోటో షూట్‌ మాత్రం క్రేజీగా ఉంది. నెట్టింట రచ్చ చేసేలా ఉండటం విశేషం. 
 

నభా నటేష్‌(Nabha Natesh).. అదిగో సినిమా, ఇదిగో సినిమా అంటూ ఊరిస్తుంది. ప్రకటనలకే పరిమితమవుతుంది. ఆమె ఇప్పటి వరకు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే ఆ మధ్య హెల్త్ సమస్యని ఫేస్‌ చేయడం వల్ల సినిమాలకు గ్యాప్‌ వచ్చింది. 
 

అయినా తన వద్ద రెండు మూడు ఆఫర్లు ఉన్నాయని ఆమెనే ప్రకటించింది. త్వరలో వాటికి సంబంధించిన అప్‌డేట్‌ వస్తుందని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో వెయిట్‌ చేస్తున్నారు. వారికి నిరాశనే ఎదురవుతుంది. 
 


ఈ నేపథ్యంలో ఇక గ్లామర్‌ షోకి తెరలేపింది. అందాల ఫోటో షూట్లతో మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ దివాళీ స్పెషల్ పంచుకుంది. ఆమె చీరకట్టులో రెచ్చిపోయింది. పట్టు చీర కట్టి అరటి తోటలో అందాల విందు చేసింది. కవ్వింపు చర్యలతో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నభా నటేష్‌.. లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

ఈ సందర్భంగా ఆమె దీపావళి విషెస్‌ తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందపు కాంతులు వెలగాలని, సంతోషం, మంచి ఆరోగ్యం దక్కాలని ఆమె వెల్లడించింది. లైఫ్‌ దీపావళి వెలుగులా ప్రకాశించాలని పేర్కొంది.  నాభా నటేష్‌..కన్నడ బ్యూటీ. అయితే ఈ కన్నడ భామలు ఇండియన్‌ సినిమాని ఏలుతున్నారు. స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ నభా మాత్రం రాణించలేకపోతుంది. ఆమె ఇంకా స్ట్రగులింగ్‌లోనే ఉంది. 
 

`వజ్రకాయ` వంటి సూపర్‌ హిట్‌ మూవీతో కెరీర్‌ని స్టార్ట్ చేసింది నభా. కన్నడలో సక్సెస్‌ కావడంతో తెలుగులో ఆఫర్లని అందుకుంది. ఇక్కడ `నన్ను దోచుకుందువటే` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఫర్వాలేదనిపించుకుంది. `అదుగో` చిత్రంలో మెరిసింది. పెద్దగా ఉపయోగం లేదు. 
 

ఈ క్రమంలో `ఇస్మార్ట్ శంకర్‌` హిట్‌ ఈ బ్యూటీకి బూస్ట్ ఇచ్చింది. ఇందులో అందాల డోస్‌ నెక్ట్స్ లెవల్ చూపించి పాపులర్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత కలిసి రాలేదు. హిట్లు పడలేదు. `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాలు చేసింది. పరాజయాలను చవిచూసింది. 
 

దాదాపు రెండేళ్లుగా ఈ బ్యూటీ నుంచి సినిమా లేదు. అయితే తన చేతిలో ప్రాజెక్ట్ లు ఉన్నాయని చెబుతుంది, కానీ వాటి అప్‌డేట్లు ఏమీ లేవు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆ అమ్మడు ఫోటో షూట్లు చేయడం కూడా అనుమానాలకు తావిస్తుంది. మరి ఈ ఫోటో షూట్లని చూసైనా మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి. 
ఉల్లిపొరకంటే పలుచని టాప్‌లో శృతి తెగింపు పోజులు.. 360 డిగ్రీస్‌లో అందాలు చూపిస్తూ దివాళీ ట్రీట్‌

Latest Videos

click me!