`ఆచార్య`లో అనుష్క పాత్రపై దర్శకుడు క్లారిటీ.. `మిర్చి` లాంటి బ్లాక్స్ అంటూ ట్విస్ట్.. మెగా ఫ్యాన్స్ కి పండగే!

Published : Apr 27, 2022, 08:06 PM ISTUpdated : Apr 27, 2022, 08:07 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆచార్య` మరో రెండో రోజుల్లో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో స్వీటి అనుష్క సర్‌ప్రైజింగ్‌ రోల్‌లో మెరవబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. 

PREV
16
`ఆచార్య`లో అనుష్క పాత్రపై దర్శకుడు క్లారిటీ.. `మిర్చి` లాంటి బ్లాక్స్ అంటూ ట్విస్ట్.. మెగా ఫ్యాన్స్ కి పండగే!

చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన `ఆచార్య`(Acharya) చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌ ఆకబోతుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడి విడుదల కాబోతుంది. శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో చిరుకి జోడీగా కాజల్‌ నటించగా, ఆమె పాత్రని తీసేశారు. దీంతో చిరంజీవికి జోడీ లేదు. చరణ్‌.. పూజా హెగ్డే(Pooja Hegde)తో ఆడిపాడబోతున్నారు. కానీ గ్లామర్‌సైడ్‌ కాస్త సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అందుకు అనుష్క(Anushka Shetty)ని రంగంలోకి దించారనే టాక్‌ వైరల్‌ అవుతుంది. 

26

తాజాగా దీనిపై దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) స్పందించారు. సినిమాలో అనుష్క ఓ పాటలో మెరవబోతుందని, గ్లామర్‌ సైడ్‌ మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేయబోతుందని వార్తలొస్తున్నాయనే ప్రశ్నకి దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. అలాంటి సర్‌ప్రైజ్‌లు ఏమీ లేవని తేల్చేశాడు. అనుష్క నటిస్తుందనేది కేవలం రూమర్‌ మాత్రమే అని, అందులో నిజం లేదని చెప్పారు. విరుద్ధ భావాలు కలిగిన ఇద్దరి పాత్రల జర్నీని చూపించే చిత్రమిది అని, ఎమోషనల్‌గా సాగుతుందని, యాక్షన్‌ఎపిసోడ్‌ పుష్కలంగా ఉంటాయన్నారు. 
 

36

చిరంజీవి పాత్రకి సెపరేట్‌ యాక్షన్‌ ఉంటుందని, అలాగే రామ్‌చరణ్‌కి సెపరేట్‌గా ఉంటుందని, చివర్లో ఇద్దరు కలిసి చేసే యాక్షన్‌ అదిరిపోతుందన్నారు. మరోవైపు ఓ చిన్న ట్విట్‌ ఇచ్చారు కొరటాల. ఇందులో `మిర్చి`(Mirchi Movie) లాంటి యాక్షన్‌ ఎపిసోడ్‌ బ్లాక్స్ ఉంటాయని చెప్పారు. 

46

`మిర్చి` సినిమా తర్వాత తాను మాస్‌ కమర్షియల్‌ చిత్రాలు తగ్గించానని, ఆ లోటుని `ఆచార్య`లో భర్తీ చేసినట్టు చెప్పారు. `మిర్చి` వచ్చే గూస్‌బంమ్స్ యాక్షన్‌ ఎపిసోడ్స్ లో `ఆచార్య`లో ప్లాన్‌ చేశామని అవి వెండితెరపై అబ్బురపరిచేలా, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటాయని చెప్పారు. 

56

పాన్‌ ఇండియా సినిమాపై ఆయన స్పందిస్తూ, పాన్‌ ఇండియాకి చిన్న చిన్న కొలతలుంటాయని, అందరికి ఎమోషన్‌ కనెక్ట్ అయ్యేలా ఉండాలన్నారు. సినిమాలోని పాయింట్‌ ఎక్కువ మందికి కనెక్ట్ అవుతే అదే పాన్‌ ఇండియా అని, దేనికైనా ఎమోషన్‌ ముఖ్యమన్నారు. ఎమోషన్స్‌ కనెక్ట్ అయితే అది అందరికి నచ్చుతుందన్నారు. 

66

ఎన్టీఆర్‌ 30(NTR30) సినిమాపై స్పందిస్తూ, ఎన్టీఆర్‌పై `జనతా గ్యారేజ్‌`లో కొత్తగా ట్రై చేశామని, అది వర్కౌట్‌ అయ్యిందన్నారు. కానీ ఈ సారి ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, బిగ్‌ కాన్వాస్‌లో సినిమా ఉంటుందన్నారు. హై ఓల్టేజ్‌యాక్షన్‌ చిత్రంగా ఇది నిలుస్తుందని, `ఆచార్య` రిలీజ్‌ అయి, రిలాక్స్ అయ్యాక ఆ సినిమాని పట్టాలెక్కిస్తామని తెలిపారు. ఇంకా హీరోయిన్‌ ఎవరనేది అనుకోలేదన్నారు. అయితే ఎన్ని హిట్లు కొట్టినా టెన్షన్‌ ఉంటుందని, ఎగ్జామ్‌ రాశాక రిజల్ట్ పై అందరికి టెన్షన్‌ ఉంటుందని తనకు అలానే ఉందని, ఎగ్జామ్‌ బాగా రాయకపోతే ఏ టెన్షన్‌ ఉండదన్నారు కొరటాల శివ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories