స్టార్ లేడీ తమన్నా భాటియా ఇటీవల తన లవర్ ని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా విజయ్ వర్మతో తమన్నా ఎఫైర్ నడుపుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ ని విజయ్ వర్మ, తమన్నా కొట్టిపారేస్తూ వచ్చారు.