చైనా లోని స్కూల్ లో చిరంజీవి లైఫ్ స్టోరీపై ప్రసంగం..అదరగొట్టేసిన చిన్నారి, ఇది కనుక మెగాస్టార్ కి తెలిస్తే

First Published | Feb 11, 2024, 1:37 PM IST

మెగాస్టార్ చిరంజీవి అంటే కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యుడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న స్టార్స్, ఇతర టెక్నీషియన్స్, నటీనటులు, దర్శకులు ఎందరో ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి అంటే కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యుడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న స్టార్స్, ఇతర టెక్నీషియన్స్, నటీనటులు, దర్శకులు ఎందరో ఉన్నారు. చిరంజీవి సినీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమే అని చెప్పాయి. 

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి తన ప్రతిభతో పద్మ విభూషణ్ అవార్డు అందుకునే స్థాయి వరకు ఎదిగారు. ఆస్కార్ వేదికకి ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా ఘనత సాధించింది కూడా చిరంజీవే. చిరంజీవి అంటే డ్యాన్సులు, ఫైట్స్, నటన గుర్తుకు వస్తాయి. అంతకి మించిన క్రమశిక్షణ చిరంజీవి సొంతం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..తెలుగు రాష్ట్రాల్లో.. ఇండియాలో చిరంజీవి గురించి చెప్పుకోవడం కామన్. 


Chiranjeevi

కానీ తాజాగా చిరంజీవి లైఫ్ చైనా దేశంలో కూడా ఆదర్శప్రాయమైన ప్రసంగంగా మారింది. ఓ చిన్నారి చైనా దేశంలోని స్కూల్ లో చిరంజీవి ఆదర్శవంతమైన జీవితాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇంతకీ ఆ చిన్నారి ఎవరు.. చైనా స్కూల్ లో చిరంజీవి జీవితం గురించి ఎందుకు ప్రసంగించింది అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి. అనకాపల్లికి చెందిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కొణతాల విజయ్ ప్రస్తుతం అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కొణతాల విజయ్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని డ్యాన్స్ లు చేసేవాడు. ఆ విధంగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. 

తెలుగు టివి ఛానల్స్ లో కూడా కొరియోగ్రాఫర్ గా రాణించాడు. ఆ తర్వాత థాయ్ ల్యాండ్ లో కూడా కొణతాల విజయ్ కి అవకాశాలు వచ్చాయి. థాయ్ లాండ్ నుంచి కొందరు మిత్రుల ఆహ్వానంతో చైనా వెళ్ళాడు. చైనాలో కొరియోగ్రాఫర్ గా బాగా పాపులర్ అయ్యాడు. కొణతాల విజయ్ కుమార్తె స్కూల్ లో చిరంజీవి గురించి ప్రసంగించింది. 

తన తండ్రి సక్సెస్ కి మెగాస్టార్ చిరంజీవి కారణం అంటూ తరగతి గదిలో తన తోటి విద్యార్థులకు చెప్పింది. ఆ విధంగా చిరంజీవి గొప్పతనాన్ని కూడా పంచుకుంది. ఆయన ఎంతో ఆదర్శవంతమైన నటుడు అంటూ ప్రశంసలు కురిపించింది. ఆ విధంగా మెగాస్టార్ ఖ్యాతి చైనాకి చేరింది అని చెప్పొచ్చు. ఈ చిన్నారి గురించి తప్పకుండా చిరంజీవికి తెలియాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. చిరంజీవికి తెలిస్తే ఆ చిన్నారిని అభినందిస్తారు అని అంటున్నారు.  

Latest Videos

click me!