ఈ ఒక్క ఘటన సరిపోదా.. చిరు - పవన్ మధ్య ఎంతటి ప్రేమ ఉందో చెప్పడానికి.!

First Published | Aug 22, 2023, 12:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి -  పవన్ కళ్యాణ్ మధ్య బాండింగ్ కు సంబంధించిన ఓ ఘటన చాలా మందికి తెలియదు. ఆ విషయం ఇటీవల బయటకి వచ్చింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ న్యూస్ మరింత వైరల్ గా మారింది.
 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎంతటి నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. మెగా ఫ్యామిలీ అనే మహావృక్షానికి మూల స్తంభంలా ఉన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అటు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేశారు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. 
 

అన్న రాజకీయాలను వదిలిన సమయంలోనే తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కొందరు అన్న చిరును పొగుడుతూ.. తమ్ముడు పవన్ ను విమర్శిస్తున్నారు. మరికొందరు మెగా బ్రదర్స్, ఫ్యామిలీ మీద ఇష్టానుసారంగా పుకార్లు సృష్టిస్తున్నారు. 
 


కానీ మెగాస్టార్ చిరంజీవి - వవన్ కళ్యాణ్ మధ్య ఎంతటి ప్రేమానురాగం ఉంటుందో వాళ్లకి దగ్గరిగా ఉండే వాళ్లకే తెలుస్తుంది. ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ ఎలాంటిదో అర్థం అవుతుంది. అయితే వీరిమధ్య ఉన్న బాండింగ్ ను తెలియజేసేలా ఓ ఘటనను అభిమానులు ఉదహరిస్తున్నారు. 
 

ఈరోజు మెగాస్టార్ పుట్టిన రోజు కావడంతో చిరు - పవన్ మధ్య ఉన్న బంధాన్ని, ప్రేమను తెలియజేసేందుకు సాక్ష్యంగా గతంలో జరిగిన ఓ ఘటనను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. రీసెంట్ గా ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ ఆ ఇన్సిడెంట్ ను తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమా షూటింగ్ ఓ ఇంటిలో జరుగుతోంది. అక్కడ యూనిట్ లోని ఒకరు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చారు. అది చూసిన ఇంటి ఓనర్ అతన్ని బూతులు తిట్టి వెళ్లిపోమన్నారు. వెంటనే కళ్యాణ్ ఓనర్ ను ప్రశ్నించారు. అయినా తగ్గని యజమానికి పవన్ నూ అవమానించారు. దీంతో అక్కడి నుంచి షూటింగ్  క్యాన్సిల్ చేసుకొని పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. 
 

అయితే, అప్పటికే వేరే లోకేషన్ లో షూటింగ్ తో బిజీగా ఉన్న చిరంజీవికి ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా తమ్ముడిని వెళ్లిపో అంటావా? నీ ఇంటి ఖరీదెంతా అంటూ ప్రశ్నించాడు. తమ్ముడిపై ఉన్న ప్రేమను ఇలా చూపించారని బాబీ చెప్పుకొచ్చారు. దాంతో మెగా బ్రదర్స్ మధ్య ఉన్న ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక చిరు బర్త్ డే సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ విషెస్ తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాసిన విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!