సోషల్ మీడియాలో పెరిగిపోతున్న రామ్ చరణ్ క్రేజ్.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్!

First Published | Feb 8, 2023, 6:05 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ సోషల్ మీడియాలో వేగంగా పెరిగిపోతోంది. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న చెర్నీ.. నెట్టింటా మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటున్నారు. 
 

‘చిరుత’తో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరోయిన్ రామ్ చరణ్. తొలిచిత్రంతోనే నటనలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. 
 

‘మగధీర’తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. అదిరిపోయే వసూళ్లను రాబ్టటి తన సత్తా చాటారు. ‘ఆరెంజ్’ సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇలా సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. 
 


రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’తో సౌత్ ఉత్తమ నటుల జాబితాలో చేరిపోయారు చెర్రీ. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా కీర్తి పొందారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. 
 

అయితే, రామ్ చరణ్ కు సోషల్ మీడియాలో అధికంగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో 12 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు చెర్రీ. అతితక్కువ పోస్టులు పెట్టినప్పటికీ.. తక్కువ టైమ్ లోనే ఇంతటి క్రేజ్ ను దక్కించుకుని రికార్డు క్రియేట్ చేశారని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు దక్కుతుండటం విశేషం. అటు ట్వీటర్ లోనూ దాదాపు 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
 

ఇక ఇన్ స్టాలో 19.9 మిలియన్ల అత్యధిక ఫాలోవర్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారు. యూత్ సెన్సేషన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ 17.8 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు. ప్రభాస్, మహేశ్ బాబు పది మిలియన్లలోపే ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. 

రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్ ను లైన్ పెడుతున్నారు. తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబుతో ‘ఆర్సీ16’ను కూడా ప్రకటించారు. ఇక స్టార్ డైరెక్టర్లు చెర్రీతో కలిసి వర్క్ చేసేందుకు కథలతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!