Manchi Rojulochaie Review: `మంచి రోజులు వచ్చాయి` సినిమా రివ్యూ.. మారుతి బ్రాండ్‌ వర్కౌట్‌ అయ్యిందా?

First Published | Nov 4, 2021, 8:10 AM IST

దర్శకుడు మారుతి.. ఓ వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో ఇలా తనకు నచ్చిన కాన్సెప్ట్ తో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అలా తీసిందే `మంచి రోజులు వచ్చాయి`. దీన్ని ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించారు. ప్రభాస్‌, బన్నీ వంటి తారల అభినందనలు అందుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా గురువారం(నవంబర్‌ 4)న విడుదలవుతుంది. అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని బుధవారం రాత్రినుంచే స్పెషల్‌ ప్రీమియర్స్ వేశారు. సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించిన ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

దర్శకుడు మారుతి(Director Maruthi) బ్రాండ్‌తో వస్తోన్న చిత్రం `మంచి రోజులు వచ్చాయి`(Manchi Rojulochaie). జనరల్‌గా మారుతి అంటే తన సినిమాల్లో హీరోకి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపం వల్ల పుట్టే కామెడీని హైలైట్‌గా చేసుకుని, చివరికి దానికి ఎమోషన్స్ ని జోడించి, కాస్త లవ్‌ స్టోరీని మిక్స్ చేసి ఓవరాల్‌గా ఆడియెన్స్ ని ఎంటర్టైన్‌ చేస్తుంటాడు. `భలే భలే మగాడివోయ్‌`, `మహాను భావుడవురా` చిత్రాలు ఆ కోవకి చెందినవే. అయితే ఈ సారి తన డైరెక్షన్‌ క్రెడిట్‌ వేసుకోకుండా `మంచి రోజులు` చిత్రాన్ని తీశాడు. ఓ వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో ఇలా తనకు నచ్చిన కాన్సెప్ట్ తో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అలా తీసిందే `మంచి రోజులు వచ్చాయి`. దీన్ని ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించారు. ప్రభాస్‌, బన్నీ వంటి తారల అభినందనలు అందుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా గురువారం(నవంబర్‌ 4)న విడుదలవుతుంది. అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని బుధవారం రాత్రినుంచే స్పెషల్‌ ప్రీమియర్స్ వేశారు. సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించిన Manchi Rojulochaie Review ఎలా ఉందో చూద్దాం. 

కథః 
హైదరాబాద్‌లో ఉండే తిరుమల శెట్టి గోపాలం అలియాస్‌ గుండు గోపాలం(అజయ్ ఘోష్‌) ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటాడు. దాన్నిఆసరాగా తీసుకున్ని ఆయన ఇంటి పక్కన ఉండే మూర్తి, కోటీ అనే ఇద్దరు తరచూ గోపాలాన్ని టెన్షన్‌కి గురి చేస్తుంటారు. దీంతో వాళ్లు ఆనందాన్ని పొందుతుంటారు. గోపాలం కూతురు పద్మజ(మెహరీన్‌) బెంగుళూరులో సాప్ట్ వేర్‌జాబ్‌ చేస్తుంది. అదే కంపెనీలో పనిచేసే సంతోష్‌(సంతోష్‌ శోభన్‌)తో ప్రేమలో పడుతుంది. వీరిద్దరు మూడేళ్లుగా రిలేషన్‌లో ఉంటారు. 2020 కరోనా ప్రారంభం సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వడంతో పద్మజ, సంతోష్‌ సొంతూళ్లైన హైదరాబాద్‌కి వస్తారు. అయితే గోపాలాన్ని ఈ సారి బాగా భయపెట్టించాలని నిర్ణయించుకుంటున్నారు కోటీ, మూర్తి. అందుకు తన కూతురు పద్మజ, సంతోష్‌ ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరు లేచి పోయిపెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెబుతారు. దీంతో మరింత టెన్షన్‌ పడుతుంటాడు గోపాలం. తండ్రి భయానికి సంతోషే కారణమని భావించిన పద్మజ ఆయనతో గొడవ పడుతుంది. మరి దూరమవుతున్న తన ప్రేమని సంతోష్‌ ఎలా దగ్గర చేసుకున్నాడు, గోపాలం టెన్షన్‌ ఎలా తొలగించాడు. ఇంతకి వారి ఫ్యామిలీకి దగ్గరయ్యాడా? అన్నది కథ. 


విశ్లేషణః 

దర్శకుడు మారుతి అంటే ఎంటర్‌టైనింగ్‌కి పెట్టించి పేరు. చిన్న చిన్న ఎమోషన్స్, మనిషిలోని లోపాలను తెరపై ఆవిష్కరిస్తూ సక్సెస్‌ కొడుతుంటాడు. అలాగే మనిషిలో సంతోషం, దు:ఖం, కోపం త‌ర‌హాలో భ‌యం కూడా ఓ ఎమోష‌న్‌. మ‌నిషికి భ‌యం ఉండాలి. కానీ దానికి ఓ ప‌రిమితి ఉండాలి. ఎక్కువ భ‌య‌ప‌డినా ప్ర‌మాదమే. అనే పాయింట్‌ను చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. మన పక్కనే ఉంటూ మ‌న‌కు మంచి చేస్తున్న‌ట్లు న‌టిస్తూ చెప్పుడు మాట‌లు చెప్పే వ్య‌క్తులు మ‌న‌కు లేనిపోని భ‌యాల‌ను క‌లిగిస్తుంటారు. వాట‌న్నింటినీ దూరంగా ఉంచి సంతోషంగా జీవితంలో ముందుకెళ్లాల‌ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు మారుతి. 

అయితే మారుతి హీరోలో అలాంటి లోపాలు పెట్టి దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా నడిపిస్తుంటాడు. కానీ `మంచి రోజులు వచ్చాయి` చిత్రంలో హీరోకి కాకుండా హీరోయిన్‌ తండ్రి పాత్రకి పెట్టడం ఇందులో వెరైటీ అని చెప్పొచ్చు.  మారుతి ట్రాక్‌ మార్చినట్టే ఫలితం ట్రాక్‌ కూడా మారినట్టు అనిపిస్తుంది. భయం అనే లోపాన్ని అజయ్‌ ఘోష్‌లో ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా చూపించారు. అయితే అదే హీరోలో చూపించి ఉంటే  ఫలితం వేరేలా ఉండేదేమో. ఈ కారణంగా సినిమా మొత్తం అజయ్ ఘోష్‌ పాయింట్‌ ఆఫ్‌వ్యూలో సాగుతుంది. అసలు హీరో అజయ్‌ ఘోష్‌ అయిపోయాడు సంతోష్‌, మెహరీన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మారిపోయారు. 

సినిమా మొదటి భాగం మొత్తం అజయ్‌ పాత్రని హైలైట్‌గా చూపించారు. ఆయన భయపడే సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. దీంతో మెహరీన్‌, సంతోష్‌ల ప్రేమ కూడా తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో స్క్రీన్‌ప్లే కూడా తన గత సినిమాల మాదిరిగా గ్రిప్పింగ్‌గా రాసుకోలేకపోయాడు. ఇక ద్వితీయార్థంలో ఎమోషన్స్ పై దృష్టిపెట్టారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ఎమోషన్‌ని, అదే సమయంలో తల్లీ కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించారు. అయితే అందులో డెప్త్ లేకపోవడంతో బలమైన ఎమోషనల్‌ సన్నివేశాలు కూడా తేలికగా అనిపిస్తుంటాయి.
 

అయితే సెకండాఫ్‌లో అజయ్‌ ఘోష్‌, ప్రవీణ్‌ వాయిస్‌తో మాట్లాడే అప్పడాల విజయలక్ష్మి అనే పాత్రల మధ్య వచ్చే కామెడీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఈ కామెడీ ట్రాక్ హైలైట్‌గా నిలిచింది. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు నవ్వు తెప్పిస్తుంది. అదే సమయంలో చాలా చోట్ల ల్యాగ్‌ కనిపిస్తుంది. క్లైమాక్స్ లో బలమైన ఫినిషింగ్‌ టచ్‌ కనిపించదు. రక్తికట్టించే అంశాలు పండకపోవడంతోఈ సినిమా సినిమాలా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. అందులో భాగంగానే అప్పటి వరకు భయపడుతూ కనిపించే అజయ్‌ ఘోష్‌ క్లైమాక్స్ లో సడెన్‌గా మారిపోవడంతో అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్‌ కలుగుతుంది.

నటీనటులు ప్రదర్శనః 

హీరో సంతోశ్ శోభ‌న్ పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించాడు. త‌న ప్రేమ కోసం రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో హీరోలా హీరోయిన్ ఇంటి ప‌క్క‌న అద్దెకు దిగి, ఆమె తండ్రిని ఇంప్రెస్ చేసే పాత్ర‌లో క‌నిపిస్తాడు. హీరోయిన్ మెహ‌రీన్ పాత్ర‌కు న‌ట‌న ప‌రంగా అంత స్కోప్ లేదు. వెన్నెల కిషోర్‌ పాత్ర నవ్విస్తుంది. ఉన్నంతలో త‌ను ఓకే. ఇక ప్ర‌వీణ్‌, వైవా హ‌ర్ష‌.. మూర్తి, కోటి పాత్ర‌ల‌ను పోషించిన న‌టులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. ఇక స‌ప్త‌గిరి పాత్ర‌ సినిమాకి కనెక్టింగ్ అయినట్టుగా లేదు. 
 

టెక్నీకల్‌గాః 
దర్శకుడు మారుతి  తనలోని బలమైన ఫన్‌, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలను బలంగా రాసుకోలేకపోయాడు. కథని గ్రిప్పింగ్గా నడిపించలేకపోయాడు. దీంతో సినిమా రిజల్‌ కాస్త నిరాశ పరుస్తుంది.  అనూప్‌ రూబెన్స్ సంగీతం సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. కానీ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవలేకపోయాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఫర్వాలేదు. కెమెరామెన్‌ సాయి శ్రీరామ్‌ మంచి విజువల్స్ అందించారు. సినిమాకి రిచ్‌ లుక్‌ తీసుకొచ్చారు. ఎడిటర్ సెకండాఫ్‌లో ల్యాగ్ విషయంలో మరి కాస్త దృష్టిపెట్టాల్సింది. 

ఫైనల్‌ థాట్‌ః ద‌ర్శ‌కుడు మారుతికి ఇలాంటి `లోపాల` కథలపై నమ్మకం పోయినట్టుంది. అందుకే క్రెడిట్‌ వేసుకోవడం లేదు. అతను క్రెడిట్‌ ఎందుకు వేసుకోలేదో సినిమా ఫలితం చెబుతుంది. ఆయనకు సినిమా
ఫలితంపై నమ్మకం లేదనే ఫీలింగ్‌ని చెప్పకనే చెప్పేశాడు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Rating-2.25

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

దర్శకత్వం : మారుతి

నిర్మాతలు: ఎస్ కె ఎన్

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

కెమెరా : సాయి శ్రీరామ్

Latest Videos

click me!