టైట్ ఫిట్ లో తమిళ బ్యూటీ మాళవికా మోహనన్.. లేటెస్ట్ స్టిల్స్ చూస్తే ఉక్కిరిబిక్కిరే..

First Published | Dec 19, 2023, 5:04 PM IST

మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.  

తమిళ హీరోయిన్ గా మాళవిక మోహనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే కోలీవుడ్ లో ‘పేట’, ‘మాస్టర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటనతో ఆకట్టుకుంది.

ప్రస్తుతం భారీ చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ హంగామా చేస్తోంది. ఈ సందర్భంగా మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో నూ  చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన గురించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. 


మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. కుర్రాళ్లను తనవైపు తిప్పుకునేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది.

రెడ్ టైట్ ఫిట్ లో మాళవికా మోహనన్ స్టన్నింగ్ గా మెరిసింది. తన అందాల విందుతో అదరగొట్టింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. టాప్ గ్లామర్ షోతో యువతను చిత్తు చేసింది. 

కొన్నాళ్లుగా మాళవికా తన అందంతో ఆకర్షిస్తూనే వస్తోంది. అందుకు తోడు లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో మెరుస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్రకారుకు అసలైన అందాలను వడ్డిస్తూ రచ్చ చేస్తోంది. 

ఇక నెటిజన్లూ ఈ ముద్దుగుమ్మను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. తను పంచుకునే ఫొటోలను క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాళవికా చియాన్ విక్రమ్ సరసన ‘తంగలాన్’లో నటిస్తోంది.    త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. 
 

Latest Videos

click me!