Keerthy Suresh: స్టన్నింగ్ ఫోజులతో గుండెలు గుంజేస్తున్న కీర్తి... స్లిమ్ అయ్యాక అసలు తగ్గడం లేదుగా!

Published : Jun 18, 2022, 02:02 PM IST

సన్నబడ్డ కీర్తి సురేష్ సోయగాల విందు చేస్తుంది. నాజూకు అందాలు అన్ని కోణాల్లో చూపిస్తూ అల్లరి చేస్తుంది. కీర్తిలో వచ్చిన ఈ సరికొత్త మార్పును ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె గ్లామర్ ని ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

PREV
17
Keerthy Suresh: స్టన్నింగ్ ఫోజులతో గుండెలు గుంజేస్తున్న కీర్తి... స్లిమ్ అయ్యాక అసలు తగ్గడం లేదుగా!
Keerthy Suresh


చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఆమె పరాజయాల పరంపరకు కీర్తికి సర్కారు వారి పాట(Sarkaru vaari Paata) బ్రేక్ ఇచ్చింది. సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం రెండు వందలకు పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా సర్కారు వారి పాట నిలిచింది. మహానటి చిత్రం తర్వాత కీర్తి నటించిన హిట్ మూవీ సర్కారు వారి పాట కావడం విశేషం.

27
Keerthy Suresh

ఇక మహేష్ (Mahesh babu) తో కీర్తి కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి.  క్యూట్ అండ్ కన్నింగ్ క్యారెక్టర్ లో కీర్తి నటించిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఏ విధంగా చూసినా కీర్తికి ఈ చిత్రం మంచి మైలేజ్ తెచ్చి పెట్టింది.

37
Keerthy Suresh

కాగా కీర్తి(Keerthy Suresh) ఓ తరహా పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యం కోరుకుంటున్నారు. సర్కారు వారి పాటలో గ్లామర్ రోల్ చేసిన కీర్తి, చిన్ని మూవీలో డీగ్లామర్ రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిన్ని సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీరియల్ కిల్లర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. 
 

47
Keerthy Suresh

మరోవైపు సీనియర్ స్టార్ హీరోల చెల్లి పాత్రలు చేయడానికి వెనకడుగు వేయకపోవడం కొసమెరుపు. అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి... చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. నిజానికి మహేష్ పక్క ఆఫర్ వచ్చిన హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఎవరూ ఊహించని పరిణామం.
 

57
Keerthy Suresh

ఇక తెలుగులో భోళా శంకర్ తో పాటు దసరా మూవీలో నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మలయాళ చిత్రం వాషి విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మామనన్ అనే ఓ తమిళ చిత్రం చేస్తున్నారు.
 

67
Keerthy Suresh


మహానటి చిత్రం తర్వాత కీర్తి ఇమేజ్ మారిపోయింది. ఆమెకు వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ఆఫర్స్ వచ్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కాయి. అయితే ఒక్క చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. లేటెస్ట్ చిన్ని మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది.
 

77
Keerthy Suresh

కీర్తి సురేష్ తనలోని కొంటె కోణం పరిచయం చేస్తుంది. పంథా మార్చిన కళావతి సరికొత్తగా అందాల విందుకు తెరలేపింది. వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ గా సిద్ధం కావడం జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది.

click me!

Recommended Stories