లైసెన్స్ లేకుండా కారు నడిపి పోలీసులకు దొరికిపోయిన మహేష్‌ బాబు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

First Published | Sep 9, 2024, 7:16 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు బయటకు మాత్రం చాలా సైలెంట్‌గా కనిపిస్తాడు. కానీ ఆయనలో మరో యాంగిల్‌ ఉందట. చిన్నప్పుడు పోలీసులకు దొరికిపోయాడట. 
 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అంటే సిన్సియర్, కామ్‌, కూల్‌ అనేది గుర్తు వస్తుంది. ఆయన బయట ఉండటం కూడా అలానే ఉంటారు. చాలా సెలక్టీవ్‌గా మాట్లాడతారు. ప్రెస్‌ మీట్లలోనే షార్ట్ గానే మాట్లాడతారు. ఎంత కావాలో అంతే మాట్లాడతారు. టాలీవుడ్‌లోనే టాప్‌ స్టార్స్ లో ఒకరు కావడంతో ఆ హుందాతనం మెయింటేన్‌ చేస్తున్నారు. 
 

Mahesh Babu

కానీ ఆయనలో ఎవరికి తెలియని యాంగిల్స్ ఉన్నాయి. మహేష్‌ బయట ఒకలా ఉంటే, ఇంట్లో, పర్సనల్‌ లైఫ్‌లో పూర్తి భిన్నంగా ఉంటారట. పూర్తి అపోజిట్‌గా ఉంటారని తెలుస్తుంది. ఆయనతో క్లోజ్‌గా ఉండేవాళ్లు చెప్పే మాట.. మహేష్‌ చాలా సెటైర్లు వేస్తారట.

ఆయన మాటల్లో ఆ వ్యంగం ఉంటుందని అంటుంటారు. అంతేకాదు మంచి జోకులు కూడా వేస్తారట. ఆద్యంతం నవ్విస్తారని చెబుతుంటారు. పెళ్లికి ముందు మహేష్‌ బిగుసుకుపోయినట్టు ఉండేవాడట.

కానీ తాను చాలా మార్చేసినట్టు నమ్రత కూడా చెప్పింది. ఇప్పుడు ఇంట్లో తనే ఎక్కువగా మాట్లాడతాడని పలు సందర్భాల్లో ఆమె తెలిపింది.
 


ఇదిలా ఉంటే మహేష్‌ చిన్నప్పుడు మరోలా ఉండేవాడట. ఆయన చాలా అల్లరి చేసేవాడట. అంతేకాదు మహేష్‌ ఓ సారి చేసిన గొప్పపని ఏంటోబయటకు వచ్చింది. తన బాబాయ్‌ ఆదిశేషగిరిరావు ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. చిన్నప్పుడు మహేష్‌ చేసిన అలరి పని వెల్లడించాడు.

ఆ ఘటన పోలీసుల వరకు వెళ్లిందట. అదేంటనేది చూస్తే మహేష్‌ కార్‌ డ్రైవ్‌ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడట. చిన్నప్పుడు చాలా ఫాస్ట్ గా, అల్లరిగా ఉండేవాడని, తమకు చెప్పకుండానే ఇలాంటి పనులు చాలా చేసేవాడని తెలిపారు బాబాయ్‌. మరి దీనికి సంబంించి అసలు ఏం జరిగింది? పోలీసుల రియాక్షన్‌ ఏంటి? చివరికి  ఏమైంది అనేది చూస్తే..
 

మహేష్‌ బాబు తన అక్క పద్మ కారు తీసుకుని షికారుకి వెళ్లాడట. అప్పటికీ ఆయన ఏజ్‌ 14. డ్రైవింగ్‌ లైసెన్స్ లేదు. పోలీసులు చిన్నగా ఉన్న మహేష్‌ని గమనించారు. పట్టుకునేందుకు వెంటపడ్డారట. కానీ వాళ్లకి దొరక్కుండా వాళ్ల ఆఫీస్‌లోకి ఫాస్ట్ గా వచ్చేశాడట.

ఆఫీస్‌ వెనకాల కారు పెట్టి, సైలెంట్‌గా లోపలకి వచ్చి బాబాయ్‌ ఆదిశేషగిరి రావు వద్ద కూర్చున్నాడట. కానీ పోలీసులు ఎట్టకేలకు ఆఫీసుకి వచ్చారు. ఇలా ఎంక్వైరీ చేయగా, వాళ్లకి ఆది శేషగిరి రావు ఏదో చెప్పి మ్యానేజ్‌ చేశాడట. మొత్తానికి అలా మహేష్‌ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ నిజంగానే పోలీసులకు దొరికితే పెద్ద రచ్చ అయిపోయేది. అది పెద్ద న్యూస్‌ అయ్యేది.

ఎందుకంటే అప్పటికే మహేష్‌ బాల నటుడిగా నాన్న కృష్ణతో కలిసి పలు సినిమాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో పోలీసులకు లైసెన్స్ లేకుండా దొరికిపోతే పెద్ద రచ్చ అయ్యేది. చిన్నాన్న కారణంగా సేఫ్‌గా బయటపడ్డాడని చెప్పొచ్చు. 

mahesh babu

బాలనటుడిగా పలు సినిమాలు చేశాక `రాజకుమారుడు` సినిమాతో హీరోగా మారారు మహేష్‌ బాబు. తొలి సినిమా ఫర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్‌ కాదు. ఆ తర్వాత `మురారి`తో తొలి హిట్‌ని అందుకున్నాడు. `ఒక్కడు` సినిమాతో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు మహేష్‌ బాబు.

`పోకిరి` మూవీ ఆయన్ని సూపర్‌ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు రాజమౌళితో ssmb29 సినిమా చేస్తున్నారు. ఇది గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ, ఇంటర్నేషనల్‌ మూవీగా తెరకెక్కుతుంది.

ఆఫ్రికన్‌ ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రపంచ సాహసికుడి కథతో ఈ మూవీని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. 

Latest Videos

click me!