మెగా కపుల్ కాఫీ డేట్.. వైరల్ గా మారిన పిక్స్.. ఆ విషయంలో గ్రేట్ అంటున్న నెటిజన్లు

First Published | Jul 19, 2023, 6:21 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లికి ఇంకాస్తా టైం ఉండటంతో డేటింగ్ కు వెళ్తూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటున్నారు. తాజాగా కాఫీ డేట్ కు వెళ్లారు. 
 

జూన్ 9న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  నిశ్చితార్థం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు వీరి ఎంగేజ్ మెంట్ కు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. 
 

ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన లావణ్య - వరుణ్ ఏమాత్రం కూడా ఎవ్వరికీ సందేహం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడా వీరి లవ్ కు సంబంధించిన డిటేయిల్స్,, క్లూస్ దొరకకుండా చేశారు. ఆ విషయంలో చాలా గ్రేట్ అని అంటున్నారు. ఉన్నట్టుండి సడెన్ గా కలిసి జీవించబోతున్నట్టు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. 
 


ఏదేమైనా లావణ్య - వరుణ్ ప్రేమను అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు, సినీ పెద్ధలు హ్యాపీగానే ఫీలయ్యారు. సోషల్ మీడియా వేదికన విషెస్ కూడా తెలిపారు. నిశ్చితార్థం పూర్తవడంతో ఇక వీరి పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయా? అని ఎదురుచూస్తున్నారు. 

మొన్నటి వరకు ఉన్న అప్డేట్  ప్రకారం.. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలోనే లావణ్య - వరుణ్ పెళ్లి ఉండనుందని అంటున్నారు. వెన్యూ ఎక్కడనేది కూడా ఆసక్తికరంగా మారింది. వీటిపై మున్ముందు అధికారికంగా అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నెట్టింట లావణ్య - వరుణ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. 
 

మొన్నటి వరకు మెగా కపుల్ ఇటలీలో సందడి చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పిక్స్ ను అభిమానులతోనూ పంచుకున్నారు. ఇక తాజాగా కాఫీ డెట్ కు వెళ్లారు.  ఈ సందర్భంగా ఒకరి ఫొటోను మరొకరు ఇన్ స్టాస్టోరీలో  పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారి పోస్ట్ వైరల్ గా మారింది. 

పెళ్లి ముందు ఇలా డేటింగ్ కు వెళ్తూ ఆకట్టుకుంటున్నారు. పిక్స్ చూసిన ఫ్యాన్స్ నెటిజన్లు కపుల్ గోల్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాంధీవదారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. అటు లావణ్య తమిళంలో ‘తనల్’ చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!