రాకేష్ మాస్టర్ మూడో భార్యపై మహిళల దాడి... నడి రోడ్డు మీద దారుణంగా తంతూ, కారణం ఇదే!

Published : Jul 08, 2023, 07:35 AM IST

రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మి మీద దాడి జరిగింది. ఐదుగురు మహిళలు ఆమెను చితకబాదారు. లక్ష్మి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.   

PREV
16
రాకేష్ మాస్టర్ మూడో భార్యపై మహిళల దాడి... నడి రోడ్డు మీద దారుణంగా తంతూ, కారణం ఇదే!
Rakesh Master

లక్ష్మి అనే మహిళ రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చలామణి అవుతుంది. రాకేష్ మాస్టర్ వద్ద వంట మనిషిగా చేరిన లక్ష్మిని ఆయన చేరదీశాడని సమాచారం. లక్ష్మితో రాకేష్ మాస్టర్ పలు వీడియోలు చేశారు. అనేక ఇంటర్వ్యూలలో కలిసి పాలొన్నాడు. లక్ష్మిని అమ్మ అని రాకేష్ మాస్టర్ పిలిచేవాడు. అనంతరం వీరి మధ్య విబేధాలు తలెత్తినట్లు సమాచారం. 

 

26
Rakesh Master

లక్ష్మి మీద తాజాగా దాడి జరిగింది. ఐదుగురు మహిళలు ఆమెను నడిరోడ్డు మీద చితక్కొట్టారు. ఈ దాడిలో లక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. వారి దాడి నుండి తప్పించుకున్న లక్ష్మి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఐదుగురు మహిళలు తనను కావాలని టార్గెట్ చేశారంటున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన అనంతరం లక్ష్మి మీడియాతో మాట్లాడింది. 
 

36
Rakesh Master

పెరుగు పెద్దమ్మ, దుర్గ. లల్లీ, నెల్లూరు భారతి ఈ దాడి చేశారని ఆమె వెల్లడించారు. నేను యూట్యూబ్ లో ఫేమస్, నన్ను వెళ్లిపొమ్మంటున్నారు. యూట్యూబ్ వదిలేయాలని బెదిరిస్తున్నారు. నాపై దాడి చేసేందుకు నెల్లూరు భారతి లక్ష రూపాయల సుపారీ ఇచ్చింది. పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశాను. వారు తగు చర్యలు తీసుకుంటారు, అని లక్ష్మి చెప్పుకొచ్చారు. 

 

46
Rakesh Master

లక్ష్మిపై దాడి చేసిన మహిళల్లో ఒకరైన లల్లి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. దాడి చేసిన మాట నిజమే. నా మైనర్ కూతురి మీద లక్ష్మి అనుచిత కామెంట్స్ చేసింది. దాని వలన నా కూతురు స్కూల్ కి వెళ్లడం మానేసింది. అందుకు ప్రతీకారంగా దాడి చేశామన్నారు. యూట్యూబ్ వదిలి పోవాలని కాదని, లల్లీ చెప్పుకొచ్చారు. లల్లీ కూడా లక్ష్మి మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

56
Rakesh Master

అయితే రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి స్వాధీనం చేసుకున్నారని, దాని కోసమే ఈ గొడవలు అని విశ్వసనీయ సమాచారం. ఆ ఛానల్ విషయంలో లక్ష్మికి లల్లీ వర్గానికి గొడవలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
 

66

రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. వారం రోజులుగా ఇంట్లో బాధపడుతున్న రాకేష్ మాస్టర్ ని మొదట ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశాడు. రాకేష్ మాస్టర్ మృతికి పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

click me!

Recommended Stories