ఢిల్లీ బ్యూటీ, బాలీవుడ్ నటి కృతి కర్బందా టాలీవుడ్ చిత్రం ‘బోణీ’తోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. తొలినాళ్లలో సౌత్ చిత్రాల్లో బాగా మెరిసింది. తెలుగుతో పాటు కన్నడలో ఎక్కువగా సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయ్యింది.
తెలుగులో కృతి కర్బందా సుమంత్ ‘బోణీ’తో పాటు నాని ‘అలా మొదలైంది’, పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘తీన్ మార్’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం 3డీ’, చివరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’లోనూ నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటోంది. అటు బాలీవుడ్ లోనూ రెండేళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు. అయితే, తెలుగు, హిందీలో కంటే.. ఈ బ్యూటీ కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది. తన నటనతో అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
అయితే, కన్నడలో ఓ సినిమా చేస్తుండగా తనకు ఎదురైన ఓ ఘటనను తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కృతి కర్బందా మాట్లాడుతూ.. ‘నేను ఓ కన్నడ మూవీ షూటింగ్ చేస్తున్నాను. నాకు ఓ హోటల్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడే పనిచేసే ఓ వ్యక్తి నా రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టారు. స్టే చేసే రూమ్ ను చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్ కు అలవాటు.
అలా నా గదిని మొత్తం పరిశీలించగా.. సెటప్ బాక్స్ వెనకాల కెమెరా గుర్తించాం. అది చూసి షాక్ అయ్యాం. అప్పటి నుంచి ఇంకెక్కడైనా బస చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను’. అని చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాలపై మక్కువ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇలా అనుభవం కలగడం బాధాకరమని అంటున్నారు.
నటి కర్బందా ప్రస్తుతం సినిమాల జోరు పెద్దగా లేదు. బాలీవుడ్ లోనే సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ చివరిగా ‘14 ఫేరే’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమా అప్డేట్స్ లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తోంది. ఇక కర్బందా 2019 నుంచి నటుడు పుల్కిత్ సామ్రాట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.