ఎన్టీఆర్ ను బరువు తగ్గమంటున్న కొరటాల.. యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్

Published : Jun 20, 2022, 12:39 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంతో రూపుదిద్దుకోనున్న చిత్రం NTR30. కొద్ది రోజుల్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో సినిమా గురించిన పలు విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.     

PREV
16
ఎన్టీఆర్ ను బరువు తగ్గమంటున్న కొరటాల.. యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తదుపరి చిత్రాలైన ‘ఎన్టీఆర్ 30’, ‘ఎన్టీఆర్ 31’పైనా ఫోకస్ పెట్టారు.  
 

26

ఆయన అభిమానులూ ఈ చిత్రాల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ 30 నుంచి క్రేజీ అప్డేట్ అందింది. ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించేందుకు కొరటాల శివ భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

36

తాజా సమాచారం ప్రకారం.. కొరటాల శివ ఎన్టీఆర్ 30లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారంట. మునుపెన్నడూ చూడనంతగా ఎన్టీఆర్ ను మాస్ గా చూపించేందుకు కొరటాల శివ శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ ను బరువు తగ్గాలని కూడా కొరటాల చెప్పాడని టాక్ వినిపిస్తోంది. 
 

46

దీంతో ఎన్టీఆర్ ఏకంగా 9 కేజీల బరువు తగ్గనున్నారు. గతంలో ‘యమదొంగ’కోసం ఎంతలా బరువు తగ్గాడో తెలిసిన విషయమే. మరోవైపు టెంపర్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ లోనూ ఎన్టీఆర్ ఫిజికల్ ఫిట్ నెస్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. 

56

ఇక ఇప్పటికే తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టులో రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. కేవలం ఆరు లేదా ఏడు నెలల్లో సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్30 వచ్చేఏడాది వేసవి కల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఇంకా స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నారు.    
 

66

ఎన్టీఆర్ 30 అనేది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండనుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కున్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్‌లో కనిపించనున్నాడంట. ఇందులో ఒకరు ఫారెస్ట్ మాఫియాను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. సుధాకర్ మిక్కిలినేని మరియు నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

click me!

Recommended Stories